శ్రీవారి దర్శనం:18వ తేదీ ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
x

శ్రీవారి దర్శనం:18వ తేదీ ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల

తిరుమల, తిరుపతిలో గదుల కోటా కూడా...


తిరుమలకు శ్రీవారి దర్శనానికి మూడు నెలల ముందు యాత్రికులు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నెల ఆన్ లైన్ ఆర్జీత సేవాటికెట్ల కోటా 18వ తేదీ ఉదయం పది విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం తోపాటు గదుల కోటా అదే రోజు విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లలో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కోటా విడుదల చేస్తారు. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు దక్కించుకున్న యాత్రికులు 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలి
ఆర్జిత సేవా టికెట్లు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది.
వర్చువల్ సేవ:వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
అంగ ప్రదక్షిణ: తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధిలో అంగ ప్రదక్షిణ చేయడానికి కూడా టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ఈ కోటా టికెట్లు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 10,500 చెల్లించిన యాత్రికుడికి రూ. 500 వీఐపీ దర్శన టికెట్ జారీ చేస్తారు. మిగతా రూ. పది వేలు శ్రీవాని ట్రస్టుకు జమ చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగుల కోటా: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం: టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
గదులు: తిరుమ‌ల‌ శ్రీవారి క్షేత్రంతో పాటు తిరుప‌తిల‌లో గదుల కోటా కూడా ఆన్ లైన్ లో విడుద‌ల‌ చేస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
Read More
Next Story