
తిరుమల: ఏటా గరుడోత్సవం ఎన్నిసార్లు నిర్వహిస్తారో తెలుసా...
ఈ ఏడాది ఏడు రోజులు శ్రీమలయప్పస్వామివారి దర్శనం
తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తహతహలాడతారు. విశేష పర్వదినాల్లో గరుడవాహన సేవను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. శ్రీమలయప్పస్వామి వారు ఈ ఏడాది ఏడుసార్లు గరుడవాహనంపై ఊరేగుతూ మాడవీధుల్లోని యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రత్యేక ఉత్సవాల కారణంగా ఈ ఏడాది రెండు రోజులు ఆ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. కాగా, శ్రీమలయప్పస్వామి సంవత్సరంలో 20 సార్లు గరుడవాహనంపై యాత్రికులకు దర్శనం ఇస్తుంటారు.
గరుడోత్సవం ప్రాధాన్యత
తిరుమలలో సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి తర్వాత ఏడాదిలో 8 విశేష పర్వదినాల సందర్భంగా కూడా మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై అధిరోహించి తిరుమల మాడవీధుల్లో ఊరేగుతారు.
ఈ సంవత్సరం రెండుసార్లు గరుడోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ సంవత్సరం నవంబర్ 24వ తేదీ కార్తీకదీపం, డిసెంబర్ 24వ తేదీ అధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన గరుడోత్సవాన్ని రద్దు చేసినట్లు టిటిడి అధికారులు స్పష్టం చేశారు.
ఈ రోజుల్లో యథాతధం...
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ ఈ క్రింది తేదీలలో ఈ ఏడాది జరుగనున్నాయి.
గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:
1-05-2026 (శుక్రవారం)
31-05-2026 (ఆదివారం)
29-06-2026 (సోమవారం)
29-07-2026 (బుధవారం)
28-08-2026 (శుక్రవారం)
26-09-2026 (శనివారం)
26-10-2026 (సోమవారం)
గరుడవాహన సేవ రద్దు
1. 24-11-2026 (మంగళవారం) – కార్తీక పర్వ దీపోత్సవం
2. 24-12-2026 (గురువారం) – అధ్యయనోత్సవం

