యాత్రికులు పోటెత్తకున్నా.. శ్రీవారి హుండీకి రికార్డు ఆదాయం.
x

యాత్రికులు పోటెత్తకున్నా.. శ్రీవారి హుండీకి రికార్డు ఆదాయం.

రోజు నాలుగు కోట్ల రూపాయలు దాటుతున్న ఆదాయం. వేసవిలో ఎదురయ్యే రద్దీకి ఇది ఓ సంకేతమే..


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి యాత్రికుల తాకిడి స్వల్పంగా ఉంది. శ్రీవారి హుండీకి ఆదాయం మాత్రం గత రెండు రోజులుగా 4 కోట్ల రూపాయల బెంచ్ మార్కు దాటింది. వేసవి ప్రారంభానికి ముందే తిరుమల శ్రీవారి హుండీకి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నట్లు టిటిడి అధికారులు కూడా స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలకు ఈ సంకేతంగానే టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో విద్యార్థుల పదవ తరగతి పరీక్షలకు పూర్తయ్యాక మరింతగా యాత్రికుల తాకిడి పెరిగే అవకాశం ఉందని టిటిడి ముందుగానే అంచనా వేసింది.
"తిరుమల యాత్రికులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశాం. దర్శనం, వసతి కల్పించడానికి కార్యాచరణ సిద్ధం చేశాం" అని టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. మార్చ్ నెల మొదటి వారంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలకు సంసిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పారు.

నాలుగు కోట్లు దాటిన ఆదాయం..

తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు సగటున 60 నుంచి 65 వేల మంది యాత్రికులు దర్శించుకుంటూ ఉంటారు. ఆలయంలో శ్రీవారి హుండీ ద్వారా టిటిడి కి మూడు కోట్ల రూపాయల నుంచి 3.10 కోట్ల రూపాయల వరకు ఇంచుమించు ఆదాయం వస్తూ ఉంటుంది. యాత్రికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతున్నట్లు పరకామణి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
తిరుమల శ్రీవారికి మంగళవారం 70, 002 మంది యాత్రికులు మాత్రమే దర్శించుకున్నారు. వారు శ్రీవారి హుండీకి సమర్పించిన కానుకలు లెక్కించిన తర్వాత 4.88 కోట్ల రూపాయల ఆదాయం లభించిందనీ టిటిడి అధికారులు వెల్లడించారు. సోమవారం కూడా 70,606 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటే , హుండీ ద్వారా 4.39 కోట్లు ఆదాయం లభించింది. గత ఏడాది, అంతకుముందు సంవత్సరంలో కూడా ఇదే రికార్డు నమోదైంది.
2025 మార్చి 18వ తేదీ శ్రీవారి కి 3.84 కోట్ల రూపాయలు
2024 మార్చి 18 వ తేదీ 4.57 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్లు టిటిడి పరకామణి లేక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాల పరిశీలిస్తే గత రెండు సంవత్సరాలలో ఇదే రోజుతో పోలిస్తే అధికంగానే శ్రీవారి హుండీకి మరింతగా ఆదాయం పెరిగినట్లు స్పష్టమవుతుంది.

రికార్డు సాయి ఆదాయం..

తిరుమల శ్రీవారికి 2026 సంవత్సరంలో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు టిటిడి పరకామణి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
2026 జనవరి మూడో తేదీ శ్రీవారికి అంచనాలను మించిన స్థాయిలో ఆదాయం లభించింది. వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్న ఆ రోజుల్లో 88662 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటే 5.05 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.
మార్చి 10 వ తేదీ నంది సాధారణంగా ఉంది. 73, 572 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటే 4.38 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.
మార్చి 11 తేదీ భక్తుల సంఖ్య చాలా తక్కువ ఉంది. 66 606 మంది యాత్రికుల ద్వారా 4.78 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీకి ఆదాయం లభించింది.
మార్చి 13 వ తేదీ వారంతా ప్రత్యేకంగా కేవలం 6724 మంది యాత్రికులు శ్రీవారి దర్శించుకుంటే వారి ద్వారా గణనీయంగా 4.28 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్లు టిటిడి పరకామణి లెక్కల ద్వారా తెలిసింది.
మార్చి 16 వ తేదీ వారాంతపు రద్దీ ముగిసి సోమవారం కావడంతో యాత్రికుల సంఖ్య కూడా దాదాపు రద్దీ కొనసాగింది. 70, 606 మంది యాత్రికుల ద్వారా 4.39 కోట్ల రూపాయలు శ్రీవారి ఉండే ద్వారా పరకామణి ఆదాయం లభించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్యలో కూడా గణనీయంగా మార్పులు ఉన్నాయి. మంగళవారం 70, 002 మంది యాత్రికులు దర్శించుకున్నారు. సోమవారంతో పోలిస్తే 604 మంది యాత్రికులు తగ్గినారు. ఉండి ఆదాయం మాత్రం నాలుగు కోట్ల రూపాయలకు పైగానే ఉంది. పోలిస్తతక్కువయ్యారు మందికి తక్కువయ్యారు. అయినా, మొక్కుబడి ఉన్న యాత్రికులు సమర్పిస్తున్న కానుకల వల్ల హుండీ ఆదాయం పెరుగుతున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Read More
Next Story