తిరుమల:రీల్స్ కేసు ఉన్నా.. తగ్గేలేదంటున్న బిగ్ బాస్ ఫేం మాధురి
x

తిరుమల:రీల్స్ కేసు ఉన్నా.. తగ్గేలేదంటున్న బిగ్ బాస్ ఫేం మాధురి

శ్రీవారి క్షేత్రంలో పుట్టినరోజు వేడుకల నిర్వహణపై టీటీడీ ఫిర్యాదు.


తిరుమలలో శ్రీవారి కల్యాణోత్సవాలకే పరిమితం. వ్యక్తిగత కార్యక్రమాలకు ఆస్కారం లేదు. ఈ ఆంక్షలు ఉల్లింఘించిన బిగ్ బాస్ ఫేం దివ్వెల మాధురిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు మరో కేసు నమోదు చేశారు. గతంలో కూడా మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి రీల్స్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో విచారణకు వచ్చిన మాధురి తిరుమలలో తనూజ బర్త్ డే కేక్ కట్ చేసి, మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు.

తిరుమల, ఏడు కొండల పరిధిలో రీల్స్ చేయడం, ఇతర కార్యక్రమాలు చేయడానికి వీలులేని విధంగా టీటీడీ నిబంధనలు అమలు చేసింది. బిగ్ బాస్ ఫేం దివ్వెల మాధురి, తనూజకు తిరుమలలో పుట్టిన రోజు వేడకలు నిర్వహిస్తూ, బర్త్ డే కేక్ కట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో టీటీడీ భద్రతాధికారులు కన్నెర్ర చేశారు.
"ఆంక్షలు ఉల్లంఘించిన దివ్వెల మాధురిపై విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం" అని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
"దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న (గురువారం) తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధం" అని కూడా మరోసారి హెచ్చరించారు. ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని కూడా అభ్యంతరం చెప్పారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల దివ్వెల మాధురిని పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

నిఘా ఏదీ..?

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సెలబ్రిటీలను టీటీడీ సిబ్బంది సాదరంగా స్వాగతిస్తారు. వారి కదలికలపై మాత్రం నిఘా ఉంచడం లేదు. టీటీడీ నిబంధనలు, ఆంక్షలు ఉల్లంఘిస్తున్నా, పట్టించుకునే వారు లేదు. అందుకు నిదర్శనమే ఇటీవల వరుస సంఘటనలకు ఆస్కారం కలుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తిరుమలకు సెలబ్రిటీలు వస్తే, వారికి ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ రిసెప్షన్ అధికారులు గదుల కేటాయింపు, దర్శనం కల్పిస్తున్నారు. ఆ విధంగా వచ్చిన గీతూ రాయల్ ఇటీవల రీల్స్ చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది.
తిరుమల వెళ్లడానికి ముఖద్వారంగా ఉన్న అలిపిరి చెక్ పోస్టు వద్ద, ప్రయివేటు వాహనాలు అణువణువూ తనిఖీ చేస్తారు. లగేజీ స్కానింగ్ చేయడంలో రాజీ పడరు. గుడ్డు, ఇతర పదార్ధాలతో తయారు చేసిన బర్త్ డే కేక్ ఎలా తిరుమలకు తీసుకుని వెళ్లారనేది ప్రశ్న.

రీల్స్ కేసులో కోర్టుకు వచ్చి..

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న మాడవీధిలో 2014లో నిషేధాజ్నలు ఉల్లంఘించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి దివ్వెల మాధురి రీల్స్ చేశారు. అవీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బిగ్ బాస్ ఫేం దివ్వెల మాధురి తిరుపతి కోర్టుకు గురువారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత తిరుమలకు వెళ్లిన దివ్వెల మాధురి, తనూజ టీటీడీ అధికారులు కేటాయించిన గదిలో బర్త్ డే కేక్ కట్ చేయడం, తనూజకు మాధురి గిఫ్ట్ ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీటిని గమనించిన టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ద్వారా చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీల్స్ చేసిన కేసులో కోర్టులో విచారణ సాగుతుండగానే, దివ్వెల మాధురి మరో కేసులో చిక్కుకున్నారు.
Read More
Next Story