తిరుచానూరు:ఏప్రిల్ 30 నుంచి  వసంతోత్సవాలు
x
తిరుచానేరు పద్మావతీ అమ్మవారి ఆలయం (ఫైల్)

తిరుచానూరు:ఏప్రిల్ 30 నుంచి వసంతోత్సవాలు

మూడు రోజులపాటు ఆర్జితసేవలు రద్దు.


⁠ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వసంతోత్సవ టికెట్ రూ. 150

మే ఒకటో తేదీ స్వర్ణరథంపై అమ్మవారి ఊరేగింపు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఈ నెల నుంచి ౩౦వ తేదీ నుంచి మే రెండో తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ చేస్తారు. వసంతోత్సవం ఆర్జిత ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఒకో యాత్రికుడు రూ.150 చెల్లించి వసంతోత్సవ సేవలో పాల్గొనవచ్చని టీటీడీ అధికారులు సూచించారు.

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వసంతోత్సవాల నేపథ్యంలో ఈ నెల 28 , ఏప్రిల్ 30 నుంచి మే రెండో తేదీ వరకు కళ్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

స్వర్ణరథంపై అమ్మవారి ఊరేగింపు

వసంతోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారు మే ఒకతో తేదీ స్వర్ణరథంపై ఊరేగుతూ యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది. వసంతోత్సవాల్లో భాగంగా 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో అమ్మవారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వసంతోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 28వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి మొదలైనవన్నీ పవిత్రజలంతో శుద్ధి చేస్తారు.
నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు.
Read More
Next Story