
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న ముద్దాడ రవిచంద్ర. పక్కన అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చూదరి
సవాళ్ల మధ్య టీటీడీ ఈఓ బాధ్యతల స్వీకారం..
తిరుమలలో అధికారులతో ఈఓ రవిచంద్ర భేటీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో శుక్రవారం ఉదయం టీటీడీ కొత్త ఈఓ ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. గంటల వ్యవధిలోనే ఆయన తన విధులు ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఆయనకు పూర్వ అనుభవం ఉంది. టీటీడీలో తాజా పరిణామాల నేపథ్యంలో అనేక సవాళ్లు ఆయన ముందు ఉన్నాయి.
తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్న తరువాత రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఆలయ రంగనాయకుల మండపంలో ఆయనకు ఈఓ బాధ్యతలను అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి అప్పగించారు. అనంతరం తీర్థ, ప్రసాదాల తోపాటు స్వామివారి జ్ణాపికను బహూకరించారు. ఆలయం వెలుపలికి టీటీడీ సీనియర్ అధికారులతో కలిసి వచ్చిన ఆయన అన్నమయ్య భవన్ లో తిరుమలలోని అధికారులతో భేటీ అయ్యారు.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ప్రకంపనలు సృష్టించాయి. Ycp ప్రభుత్వ కాలంలో నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి దర్యాప్తు నివేదికను సిబిఐ సారధ్యంలోని సిట్ అధికారులు ఈ ఏడాది జనవరి 21వ తేదీ నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. రెండు రోజుల తర్వాత నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి కీలక సమయంలో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ ప్రేక్షక పాత్ర పోషించాలి గుర్తుచేసిన సిబిఐ, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది.
కొత్త ఈఓ రవిచంద్ర..
సిబీఐ సిఫార్సుల నేపథ్యంలో టీటీడీ ఈవో గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 1996 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో బాధ్యతలు చేపట్టడానికి బుధవారం సాయంత్రం ఆయన తిరుపతికి చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన తలనీలాలు సమర్పించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన రవిచంద్ర తన భార్యతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి నిర్వహిస్తున్న ఈవో బాధ్యతలను రవిచంద్రకు అప్పగించారు.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొత్త టీటీడీ ఈవో రవిచంద్రకు శ్రీవారి తీర్థ, ప్రసాదాలతో పాటు జ్ఞాపికలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, జేఈఓ వి. వీరబ్రహ్మం తో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ గా..
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలానికి చెందిన రవిచంద్ర 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 24 ఏళ్ల వయసులోనే ఆయన 1995లో సివిల్ సర్వీస్ పరీక్షలో పాసయ్యారు. అప్పటికే ఆయన బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ లో కూడా డిగ్రీ పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసిన రవిచంద్ర కు రాయలసీమ జిల్లాలపై సంపూర్ణ అవగాహన ఉంది.
చిత్తూరుతో అనుబంధం..
చిత్తూరు జిల్లాలో డీపీ ఏపీ పీడిగా పని చేశారు. ఆ తర్వాత నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. టీటీడీకి ఈవోగా వచ్చిన రవిచంద్ర కు తిరుపతి జిల్లా పైన ప్రధానంగా టిటిడి కి సంబంధించిన వ్యవహారాలపై అవగాహన ఉంది. గతంలో పనిచేసిన జిల్లాల్లో కూడా సమర్థవంతమైన సేవల తో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. టి టి డి వ్యవహారాలు ఎందుకో భిన్నంగా ఉంటాయి అనే విషయంలో కూడా ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆలయ నిర్వహణ, యాత్రికులకు వసతులు కల్పించడం అనేది ఇబ్బంది లేకున్న , తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే కొత్త ఈఓ రవిచంద్ర ముందు సవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు.
Next Story

