
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆలయాల విశిష్గత వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ. ప్రభాకరరెడ్డి,
మా ఆలయాలు చూడండి సార్.. జేసీ నోట ఆధ్యాత్మిక మాట
ముఖ్యమంత్రికి వివరించిన మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి
నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి వార్తల్లో ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన వ్యవహార శైలి మారింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆధ్యాత్మిక క్షేత్రాల ఫోటో ఎగ్జిబిషన్ చూపించడం ద్వారా ఆకట్టుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి కొడుకు జెసి.పవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కొడుకు, టిడిపి ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డి తో చంద్రబాబు మధ్య సాగిన మాటామంతీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.
మా ఆలయాలు చూడండి సార్..
అనంతపురం జిల్లాలో ఆధ్యాత్మిక సంపద పరిరక్షణకు కూడా సహకారం అందించాలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలోని వేములపాడు వెలిపాడుకు చేరుకున్నారు. యాడికి మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
జెసి ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష్యం
వేములపాడు వద్ద టెంపుల్ సిటీ గనులు స్వచ్ఛందర స్వర్ణాంధ్ర వ్యవసాయ అనుబంధ శాఖలు స్టార్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అదే సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును స్వాగతించారు.
"ఆ ఏం బ్రదర్ ఎలా ఉన్నారు" అని జెసి ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. ఆ సమయంలో ప్రభాకరరెడ్డి కొడుకు, జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కొడుకు జెసి పవన్ రెడ్డి కూడా వారి వెంట ఉన్నారు.
"మా తాడిపత్రిలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో చూడండి సార్. ఇక్కడి శాసనాలు కూడా పూర్వ చరిత్రను చెబుతున్నాయి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు జెసి. ప్రభాకర్ రెడ్డి వివరించారు. అదే సమయంలో రాత్రి రథం గురించి మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి వివరించారు.
"తాడిపత్రి పరిసర ప్రాంతాల పురాతన ఆలయాలకు యాత్రికులు ఎక్కువ వస్తున్నారు" అని జెసి పవన్ రెడ్డి గుర్తు చేశారు. అభివృద్ధికి సహకారం అందించాలని కూడా ఆయన కోరారు.
"యాత్రికులను, పర్యాటకులను మీరే తీసుకొస్తున్నట్టున్నారు బ్రదర్" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నవ్వుతూ చలోకి విసరడంతో నవ్వులు విరిసాయి. తాడిపత్రి నియోజకవర్గం అనే కాకుండా జిల్లాలో ఉన్న చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
Next Story

