Sullurpeta | మిత్రుడితో కలసి నవవరుడి ఆత్మహత్య..
x

Sullurpeta | మిత్రుడితో కలసి నవవరుడి ఆత్మహత్య..

మరణంలోనూ వీడిని స్నేహం.. తడ వద్ద ఘటన.


వారిద్దరూ మంచి స్నేహితులు. వారిలో ఒకరు నవ వరుడు.ఆ ప్రాణ స్నేహితులు ఇద్దరు రైలు పట్టాలపై శవాలై తేలారు. కారణం ఏంటో తెలియదు కానీ వారిద్దరూ మరణం లోను స్నేహాన్ని వదులుకోలేదు. ఈ విషాద సంఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద చోటుచేసుకుంది. తడ మండలానికి సమీపంలో రైలు పట్టాలపై శవాలైన ఆ స్నేహితులిద్దరిది సూళ్లూరుపేట మండలం పేర్నాడు కు చెందిన వారిగా గుర్తించారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవి.

సులూరుపేట మండలం పేర్నాడు గ్రామానికి చెందిన సునీల్, పిండిపాల్యానికి చెందిన కళ్యాణ్ స్నేహితులు. వారిలో కళ్యాణ్ కు నెల కిందటే పెళ్ళికూడా జరిగింది. వారిద్దరూ తడ మండలం కొండూరు వద్దకు చేరుకున్నారు. రైలు కిందపడిఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునీల్, కళ్యాణ్ మృతదేహాలను సూళ్లూరుపేట ఆసుపత్రి మార్చరీకి తరలించారు. వీరిద్దరి మరణాలతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. రైల్వే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రుల కన్నీరు..

ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు యువకుల తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది. సూళ్లూరుపేటకు మూడు కిలోమీటర్ల దూరంలోని తడ మండల పరిధిలో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. యువకుల వద్ద ఉన్న ఆధారాల తో గుర్తించి వారి సమదీయులకు సమాచారం అందించారు.
"నెల కిందటే నా కొడుక్కి పెళ్లయింది. హాయిగా ఉండాల్సిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తను చాలిస్తాడని ఊహించలేదు"అని పిండి పాలేనికి చెందిన కళ్యాణ్ తల్లిదండ్రులు శేఖర్, ప్రమీల దంపతులు కన్నీరు అయ్యారు. ఎవరితో కూడా తగువుపడని స్వభావం, ఇలాంటి ఘర్షణలు లేకుండా ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
"పేర్నాడు కు చెందిన సునీల్ కు పిండిపాలెంకు చెందిన కళ్యాణ్తో మంచి స్నేహం ఉందని, వీరిద్దరి ఈ అఘాయిత్యానికి పాల్పడడం వెనక కారణం ఏంటో కూడా తెలియడం లేదు" అని సునీల్ తల్లిదండ్రులు శివమ్మ మురళి దంపతులు విలపించడం అక్కడి వారిని కంఠతడి పెట్టించింది.

ఇంతకీ ఏం జరిగింది.. ?

చెన్నై వెళ్లే మార్గంలో సూళ్లూరుపేట నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో తడ మండల పరిధిలో ఇద్దరు స్నేహితులు సునీల్, కళ్యాణ్ రైలు పట్టాలపై సవాలుగా తీరడం వెనక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. విచారణ చేస్తే కానీ వివరాలు చెప్పలేమని అంటున్నారు. ఇదిలా ఉంటే,
సూళ్లూరుపేట నుంచి సునీల్, కళ్యాణ్ ఆదివారం తూపిలి పాలెం విహార కేంద్రం వద్దకు వచ్చారని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. సరదాగా గడిపిన స్నేహితులిద్దరూ, కొన్ని గంటల తేడాలోనే సోమవారం ఆత్మహత్యకు పాల్పడడానికి దారి తీసిన పరిస్థితి ఏమిటో కూడా తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై విభిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story