శ్రీవారి ఆలయం మూత.. బోెసిపోెయిన పరిసరాలు
x
శ్రీవారి ఆలయ సన్నిధిలో మూతపడిన వెండి వాకిలి. బలిపీఠం వద్ద కనిపించే అరుదైన దృశ్యం

శ్రీవారి ఆలయం మూత.. బోెసిపోెయిన పరిసరాలు

ఫొటోలు చెప్పే కథలు..


Also Read:Eclipse effect | దర్శనాలకు ఈ రోజు సెలవు.. శ్రీవారికి సుదీర్ఘ విరామం..


చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు టీటీడీ అధికారులు అర్చకులతో కలిసి మూసి వేశారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి యాత్రికులను శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు చెప్పారు.

తిరుమల ఆలయం ఎదుట..

శ్రీవారి ఆలయం లోపల, ముందు నిత్యం యాత్రికులతో రద్దీగా కనిపించే ప్రదేశాలన్నీ బోసిపోయాయి. స్వయంగా చూసే అవకాశం ఉండదు. కానీ, టీటీడీ 12 గంటలకు విడుదల చేసిన ఫొటోల దృశ్యాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరి పర్యవేక్షిస్తుండగా శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి నుంచి, మహద్వారం వరకు తలుపులు మూసివేసి, తాళాలు వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తో పాటు ఆలయ అధికారులు కూడా ఉన్నారు.

తిరుమల ఆలయం ముందు ఉన్న గొల్లమండపం ఎదురుగా ఇత్తడి గేట్లకు కూడా తాళాలు వేశారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది పూర్తి పహారాలోకి ఆలయం ఉంది. ఆలయంలోని బలిపీఠం వద్ద కూడా ప్రశాంతంగా మారింది. ఆ దృశ్యాలు చెప్పే చిత్రాలు ఇవి.

అరుదైన సంబర్భం:తిరుమల ఆలయ మహద్వారం వద్ద

తిరుపతిలో స్థానిక ఆలయాల వద్ద


మూతపడిన పద్మావతీ అమ్మవారి ఆలయం..













పెట్టెలో తాళాల గుత్తితో ఆలయ సిబ్బంది..


మహద్వారం వెలుపల ఆలయ సిబ్బంది



Read More
Next Story