
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం
వేసవి సెలవుల్లో.. తిరుమల యాత్రకు వస్తారా..? మీకోసమే..
18వ తేదీ ఉదయం మే నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల.
వేసవి సెలవుల్లో తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకునేందుకు యాత్రికులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనం ఆర్జిత సేవా టికెట్లు, గదుల మే నెల కోటా, ఏప్రిల్ లో శ్రీవారి సేవ, పరకామణి సేవల కోటా ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
శ్రీవారి దర్శనం, తిరుమలలో మే నెలలో వసతి గదుల కోటా ఈ నెల 18వ తేదీ (బుధవారం) ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) బుక్ చేసుకోవచ్చు. ఈ- సేవా (TTD E-seva Ticket's) టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ- సేవా టికెట్లు తీసుకున్న వారు ఫిబ్రవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలి. వారికి మాత్రమే టికెట్లు మంజూరవుతాయి అని టీటీడీ వెల్లడించింది.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి దర్శన కోటా విడుదల
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శనం
తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గదుల కోటా..
తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
శ్రీవారి సేవ
తిరుమలతో పాటు తిరుపతిలో కూడా శ్రీవారి సేవకుల ద్వారా యాత్రికులకు సేవలు అందిస్తోంది. శ్రీవారి సేవ కోసం దరఖాస్తు చేసుకునన వారికి ఆన్ లైన్ లోనే స్లాట్ కేటాయిస్తున్నారు. ఏప్రిల్ నెల శ్రీవారి కోటా ఈ నెల 27వ తేదీ విడుదల చేస్తారని టీటీడీ వెల్లడించింది. అదే రోజు
తిరుమల శ్రీవారి దర్శనం తరువాత యాత్రికులు హుండీకి కానుకలు సమర్పిస్తుంటారు. ఈ కానుకలు లెక్కించడానికి కూడా పరకామణి సేవకు వచ్చే స్వచ్ఛంద సేవకులకు ఆన్ లైన్ లో స్లాట్ కేటాయిస్తోంది. ఈ ఏప్రిల్ నెల కోటా ఈ నెల 27వ తేదీ ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
Next Story

