మెట్లోత్సవం భక్తి ప్రదర్శనకు ఓ రూపం..
x
అలిపిరి వద్ద పూజలు నిర్వహిస్తున్న దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్ధాచార్యులు

మెట్లోత్సవం భక్తి ప్రదర్శనకు ఓ రూపం..

శ్రీవారిని కీర్తిస్తూ అలిపిరి నుంచి సాగిన త్రైమాసిక మెట్లోత్సవంలో ఆనందతీర్ధాచార్యులు


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం ఉదయం నిర్వహించారు. కన్నడ హరిదాసుల బాటలో టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీవారిని కీర్తిస్తూ, భజన మండళ్ల సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుమలకు అలిపిరి మార్గంలో నడిచి వెళ్లారు. శ్రీవారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్ధాచార్యులు యాత్రికులకు వివరించారు.


"మెట్లోత్సవం యాత్ర మాత్రమే కాదు. ఆత్మశుద్ధి, భక్తి ప్రదర్శన" అని ఆనంద తీర్ధాచార్యులు సందేశం ఇచ్చారు. ఆత్మశుద్ధితో పాటు సేవా సంకల్పాన్ని కలగిస్తుందని కూడా ఆయన అన్నారు.

తిరుమలకు వెళ్లే అలిపిరి వద్ద త్రైమాసిక మోట్లోత్సవం నిర్వహించడం ఓ అనవాయితీ. అలిపిరి పాదాల మండపం వద్ద సోమవారం వేకువజామున దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో హరినామ సంకీర్తనలు ఆలపిస్తూ తిరుమలకు అలిపిరి మార్గంలో నడిచి వెళ్లారు.


తిరుమలలో మూడు రోజులపాటు త్రైమాసిక మెట్రో ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ప్రారంభించి మాట్లాడారు.

అలిపిరి వద్ద పూజలు


అలిపిరి పాదాల మండపం మెట్ల వద్ద (aliperi steps) సోమవారం వేకువజామున దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా యాత్రికులు హాజరయ్యారు. కళాకారుల భజనలతో హరినామ సంకీర్తనలతో ఆ ప్రాంతం పులకించింది. ఇక్కడ పూజలు, హారతి సమర్పణ తర్వాత యాత్రికులు కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. వందల సంఖ్యలో వచ్చిన భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి భజనలు చేశారు.


అలిపిరి కాలి బాటలో గాలిగోపురం, ఏడో మైలు వద్ద చదునుగా ఉన్న ప్రదేశాల్లో భజన మండల కళాకారులు ప్రదర్శనలతో యాత్రికులను అలరించారు.


ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టుతో పాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.

ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి

తిరుమల శ్రీవారి మెట్లొత్సవం నిర్వహణ వెనుక చారిత్రక నేపథ్య కథనం ఉంది. ఈ ఆచారం ప్రసిద్ధ కన్నడ హరిదాసుల్లో పురందరదాసు, కనకదాసు, విజయదాసులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. పురందరదాసు బ్రహ్మ ముహూర్తంలో అలిపిరి మెట్ల మార్గంలోనే ఏటా రెండు లేదా మూడుసార్లు, బ్రహ్మోత్సవాల వేళ తిరుమలకు వెళ్లేవారిని దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు యాత్రికులను ఉద్దేశించి ధార్మిక సందేశంలో ప్రస్తావించారు.
"ఈ దాస సంప్రదాయం 15, 16 శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారని చరిత్ర అందించిన వారసత్వ సంపద" అని ఆనంద తీర్థచార్యులు చెప్పారు. పూర్వకాలంలో మహర్షలు, రాజర్షుల, పురందరదాసులు, వ్యాసరాజ యతీశ్వరుడు, తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు కూడా వెంకటాద్రి పర్వతాన్ని కాలినడకన అధిరోహించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరయ్యారు.
Read More
Next Story