తిరుచానూరు:శ్రీపద్మావతీ అమ్మవారికి 30వ తేదీ నుంచి వసంతోత్సవాలు..
x
తిరుచానురు పద్మావతి అమ్వవారి పద్మపుష్కరిణి (ఫైల్)

తిరుచానూరు:శ్రీపద్మావతీ అమ్మవారికి 30వ తేదీ నుంచి వసంతోత్సవాలు..

ఏప్రిల్ నెల విశేష ఉత్సవాల తేదీల ఖరారు.


తిరుమల శ్రీవారికి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆగమశాస్త్రం ప్రకారం వేడిపండితులు నిర్ణయాలు చేస్తారు. వాాటిని టీటీడీ అమలు చేస్తుంది. అందులో భాగంగా పద్మావతీ అమ్మవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే రెండో తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 29వ తేదీ అంకురార్పణ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అంతకుయుందు 28వ తేదీ కోెయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు ప్రధానంగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి నెలపాటు నిర్వహించే పూజలు, విశేష పర్వదినాల క్యాలెండర్ సిద్ధం చేస్తారు. దీనికి సంబందించిన ఈ నెలలో (ఏప్రిల్) పద్మావతీ అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు.

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలోె...

ఏప్రిల్ 10, 17, 24 తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీపద్మావతీ అమ్మవారు పల్లకీపై విహరిస్తూ, యాత్రికులకు దర్శనం ఇస్తారు.
ఏప్రిల్ 11న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ హనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే రెండో తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు, వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 29న అంకురార్పణ
శ్రీసుందరరాజ స్వామి ఆలయంలో...
ఏప్రిల్ 16న ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా తిరుచ్చిపై సాయంత్రం 7 గం.లకు స్వామి వారు విహరిస్తారు.
శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..
ఏప్రిల్ 21న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..
ఏప్రిల్ 29 తేదీన హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..
ఏప్రిల్ 04, 11, 18, 25 తేదీలలో శనివారం ఉదయం 8 గం.లకు స్వామివారికి అభిషేకం.
అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
ఏప్రిల్ 07న మంగళ వారం ఉదయం 8 గం.లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
ఏప్రిల్ 10, 17, 24 వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.
ఏప్రిల్ 08న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.
ఏప్రిల్ 12న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం
ఏప్రిల్ 05, 12, 19, 26 తేదీలలో శ్రీ ఆంజనేయ స్వామి మూలవర్లకు అభిషేకం నిర్వహించడానికి కార్యక్రమాలు ఖరారు చేశారు.
Read More
Next Story