ఏమ్మా.. లడ్డు ప్రసాదం ఎలా ఉంది.. యాత్రికులతో సీఎం
x
తిరుమల శ్రీవారి ఆలయంలోకి క్యూలో వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం

ఏమ్మా.. లడ్డు ప్రసాదం ఎలా ఉంది.. యాత్రికులతో సీఎం

శ్రీవారి ఆలయంలోకి క్యూ లోనే వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీలకులు శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్హ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ తో కలిసి శుక్రవారం రాత్రి తిరుకులకు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోవడానికి భార్య, కొడుకు, మనవడితో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహద్వారం వద్దకు రాగానే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ ముద్దాడి రవిచంద్ర, శ్రీవారి ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.


దర్శనం తరువాత కాలినడకనే సమీపంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం వద్దకు చేరుకున్నారు. మార్గ మధ్యలో యాత్రికులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలపరించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వాకబు చేశారు.


తిరుమల యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు. అధికారం ఉన్నా, లేకున్నా సాధారణ యాత్రికుడి మాదిరే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి రావడం ఓ పద్ధతిగా మార్చుకున్నారు. అధికారంలో ఉంటే మహద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లే వెసులు బాటు ఉంటుంది. శనివారం కూడా ఆయన క్యూకాంప్లెక్స్ నుంచే ఆలయంలోకి వచ్చారు.

తిరుమల శ్రీవారి ఆలయంలోకి రాగానే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ ఎం. రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ పాలక మండలి సభ్యులు అధికారులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుంటుబం వెంట ఉన్నారు. ఆలయంలో బలిపీఠం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి బలిపీఠానికి తల ఆనించి వద్ద మౌనంగా ప్రార్థిస్తుంటే, మంత్రి నారా లోకేష్ తన కొడుకు నారా దేవాన్ష్ తో ముక్కులు చెల్లించే విధంగా ఆచార వ్యవహారాన్ని వివరించడం కనిపించింది.

తిరుమల ఆలయంలోకి వెళ్లగానే శ్రీవారి దర్శనం తరువాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.

శ్రీవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో టీటీడీ పండితులు వేదార్శీచనం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు తీర్ధప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా శ్రీవారి చిత్రపటం పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈఓ రవిచంద్ర వారికి బహూకరించారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి రాగానే సెక్యూరిటీని కూడా పక్కకు ఉంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఫోటొలో దిగారు. కాలి నడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భునేశ్వరి, మంత్రి లోకేష్, దేవాన్ష్ ఉన్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో సీఎం చంద్రబాబు, దేవాన్ష్ ఫోటో దిగారు. వారితో తిరుమలలో సదుపాయాలపై వాకబు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కరచాలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి యాత్రికులు ఆసక్తి చూపించారు. వారిని ఉత్సాహ పరిచే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యాత్రికులతో కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు.

కాలినడకన తిరుగుతూ భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమీపంలోని యాత్రికుల వద్దకు వెళ్లి మాట్లాడారు.
"ఏమ్మా శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎలా ఉంది? నాణ్యతలో ఏమన్నా తేడా ఉందా" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వాకబు చేశారు. రుచి బాగా ఉందనే అభిప్రాయాలు విన్న ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా, దర్శనం, లడ్డూ ప్రసాదాలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యాత్రికులకు సమాధానం చెప్పారు.
Read More
Next Story