
తిరుమలలో మనవడు నారా దేవాన్ష్ తో కలిసి యాత్రికులు అన్నప్రసాదాలు వడ్డిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (ఫైల్)
తిరుమలలో రేపు నారా దేవాన్ష్ పుట్టిన రోజు వేడుక..
ఈ రోజు సాయంత్రం తిరుమలకు రానున్న ముఖ్యమంత్రి కుంటుంబం.
మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుక నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీవారి దర్శనానికి ఈ రోజు సాయంత్రం రానున్నారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకుంటారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్ లో తిరుపతికి చేరుకోనున్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో యాత్రికులకు అన్నప్రసాదాలు కూడా వడ్డించనున్నారు. ఒకరోజు అన్నదానం చేయడానికి వీలుగా ఎస్వీ అన్నదాన ట్రస్టుకు 44 లక్షల రూపాయలు విరాళంగా అందించనున్నారు.
తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులు (ఫైల్)
ప్రతి సంవత్సరం తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు తిరుమల యాత్రకు రావడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆనవాయితీగా పాటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్ లో చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ తో కలిసి తిరుపతికి చేరుకోనున్నారు. ఆ తరువాత తిరుమలకు వెళ్లి, రాత్రికి అక్కడే బస చేస్తారు.
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులు దర్శించుకుంటారు. ఆ తరువాత అన్నదాన సత్రంలో యాత్రికులకు అన్నప్రసాదాలు వడ్డించనున్నారు. దీనికోసం టీటీడీ అధికారుల తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు.
Next Story

