Breaking |ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో.. పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం
x

Breaking |ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో.. పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం

విషమంగా నలుగురి పరిస్థితి. ప్రొద్దుటూరులో ఘటన


కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అత్తంటి ఆరళ్ల నేపథ్యంలోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు కూడా పోలీసుల ద్వారా తెలిసిన సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న ఆ నలుగురిని ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసుల ద్వారా తెలిసింది.

ప్రొద్దుటూరు పట్టణం ఈశ్వరరెడ్డి నగర్ కు చెందిన వెంకటరమణతో భువనేశ్వరికి వివాహం జరిగింది. వారికి 13 ఏళ్ల కూతురు, 11 సంవత్సరాల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఏడాది కిందటే భార్యాపిల్లలను వదిలేసిన వెంకటరమణ ఎటో వెళ్లిపోయాడని తెలిసింది. ఈశ్వరరెడ్డినగర్ లో అత్త తిరుపతమ్మ, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది.

ఏమి జరిగింది?

ఇంట్లో గొడవలో లేక అత్త వేధింపులో తెలియదు. కానీ భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఈశ్వరరెడ్డి నగర్ లో కలకలం రేపింది. కూల్ డ్రింక్ లో విషం కలిపి పిల్లలతో కలిసి భువనేశ్వరి కూడా తాగింది. కొద్ది సేపటికి వాంతులతో వారంతా ఇంట్లోనే పడిపోయి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. అదే సమయంలో బయటికి వెళ్లిన భువనేశ్వరి అత్త తిరుపతమ్మ ఇంటికి చేరుకుంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న కోడలు భువనేశ్వరి, పిల్లల స్థితిని గమనించి ఆందోళనకు గురైంది. ఆ కేకలు, ఏడుపు విని, చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. విషం తీసుకున్న తల్లి, ముగ్గరు పిల్లలను ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం వారందరినీ కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు.
Read More
Next Story