
మదనపల్లె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రొద్దుటూరు యువకుడు
మదనపల్లె :ప్రేమ కోసం ఓ యువకుడి అఘాయిత్యం..
ప్రియురాలి ఇంటి వద్ద శరీరానికి నిప్పంటించుకున్న ప్రొద్దుటూరు యువకుడు.
ప్రేమ పేరుతో విద్యార్థినులు, యువతులపై అఘాయిత్యం ఘటనలు. ప్రమేన్యాదుల చేతిలో అమాయకులు బలి అవుతున్నది విన్నాం. పరువు హత్యలు. సమాజంలో కలవరం రేకెత్తించే సంఘటనలు కూడా జరిగాయి.
ప్రియురాలి కోసం ప్రాణాలు తీసుకోవడానికే ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మదనపల్లె అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జరిగింది. ప్రియురాలి ఇంటిముందు ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శరీరం మొత్తం కాలిపోవడంతో చావుబతుకుల మధ్య మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఘటన వివరాలివి.
బతుకుదెరువు కోసం వెళ్లి..
తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కంటేవారిపల్లెకు చెందిన ఓ కుటుంబం పానీపూరీ ఓ బండిపై విక్రయించే వృత్తిపై జీవించడానికి కొన్ని సంవత్సరాల కిందటే ప్రొద్దూటూరుకు వెళ్లారు. వారి కూతురు పట్టణంలోని ఓ హైస్కూల్ లో చదువుతుండగా, ఆరో తరగతి నుంచి పట్టణానికి చెందిన ప్రదీప్ తో స్నేహంగా ఉండేదని తెలిసింది. పదో తరగతి వరకు వారిద్దరు కలిసి చదువుకున్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తి చేసిన ఆ బాలిక ప్రస్తుతం బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది. తన తండ్రి చేసే గుజిరీ వ్యాపారానికి ప్రదీప్ తోడుగా నిలిచారని చెబుతున్నారు.
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ప్రదీప్ తో బాలిక మరింత స్నేహంగా ఉంటోంది. గమనించిన తల్లిదండ్రులు ఇటీవల కూతురుని తీసుకుని స్వగ్రామం కంటేవారిపల్లెకు వచ్చేశారు.
శరీరంపై పెట్రోల్ పోసుకుని...
ప్రొద్దుటూరుకు నుంచి బయలుదేరిన ప్రదీప్ సోమవారం తన ప్రియురాలిని కలవాలని కురబలకోట సమీపంలోని కంటేవారిపల్లెలో ఉన్న ఆ బాలిక ఇంటి వద్దకు చేరుకున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు, ప్రదీప్ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఒక దశలో.. తీవ్రంగా బాధపడుతున్న తల్లిదండ్రులు, యువకుడిని కంట్రోల్ చేయడానికి..
"మేము చెప్పినట్లు వినకుంటే బాలికను చంపేస్తాం" అని బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారని ప్రదీప్ చెబుతున్నాడు. ఆ బాధ భరించలేక శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నానని ఆ ప్రేమికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మీడియాకు చెప్పాడు.
గ్రామంలో కలకలం
ప్రొద్దూటూరు నుంచి వచ్చిన యువకుడు ప్రదీప్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ శరీరంపై పోసుకుని, నిప్పంటించుకోవడంతో కంటేవారిపల్లెలో కలకలం చెలరేగింది. వెంటనే ఆ యువకుడిపై మంటలు ఆర్పడం తోపాటు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీపు, శరీరంర మొత్తం కాలిపోయి, చర్మం ఊడిపోవడంతో హాహాకారాలు పెడుతూ, ప్రదీప్ తన ప్రేమ వ్యథను మీడియాకు చెప్పాడు.
ప్రొద్దుటూరులో తన తండ్రి గుజిరీ వ్యాపారం చేస్తాడని ప్రదీప్ చెప్పారు. పట్టణంలో చదువుకుంటూ ఉండగానే ఆమెను ప్రేమించానని ఆ యువకుడు మీడియాకు వివరించారు. ఈ కథ ఎలా ముగుస్తుందనేది కాలమే సమాధానం చెప్పాలి.
Next Story

