తల్లికి దూరమై.. పల్లెలోకి వచ్చిన చిరుత మృతి
x
చిరుతపులి మృతదేహాన్ని పరిశీలిస్తున్న కడప జిల్లా ఒనిపెంట అటవీశాఖ అధికారులు

తల్లికి దూరమై.. పల్లెలోకి వచ్చిన చిరుత మృతి

కడప జిల్లా ఒనిపెంట వద్ద సంఘటన.


వేసవికాలం కావడంతో ఆడవిలో వన్య ప్రాణాలకు పెద్ద కష్టం వచ్చింది. నీటి కోసం అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఆరు నెలల వయసున్న చిరుతపులి కుక్కల దాడిలో మరణించింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలో ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఒనిపెంట డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (Deputy Forest Range Officer DFRO) అన్వర్ హుస్సేన్, నీలాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer FBO) సుచరిత గ్రామానికి చేరుకుని చిరుతపులి మరణంపై దర్యాప్తు చేశారు.

"ఈ చిరుత పిల్లకు ఆరు నెలల వయసు ఉంటుంది. తల్లి నుంచి వేరై, గ్రామంలోకి వచ్చినట్లు ఉంది" అని డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ చెప్పారు.

అడవిలో ప్రమాద ఘంటికలు..

అడవుల్లో స్వేచ్ఛగా సంచరించాల్సిన ఇవన్నీ ప్రాణులు గ్రామాల వైపు రావడానికి కారణం లేకపోలేదు. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు అడవుల్లో నీటి చెలిమలు ఎండిపోవడం వల్ల వన్యప్రాణులకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. సెలయేర్లు ఉన్న ప్రదేశాలకు సమీపంలో జన సంచారం ఉండడం వల్ల అటు వెళ్లడానికి కొన్ని ప్రాణాలు కూడా ప్రాణభయంతో తల్లడిల్లుతున్నాయి. అటవీ ప్రాంతంలోని జంతువులు జనారణ్యంలోని రాకుండా ఆవాసయోగ్యంగా మార్చడానికి కంపా (Compensatory Afforestation Fund Management and Planning Authority - COMPA) ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఈ వార్షిక బడ్జెట్లో వాటర్ బడ్జెట్ కూడా అమలు చేస్తోంది.
"వాటర్ బడ్జెట్ వన్యప్రాణులకు, వ్యవసాయానికి అందుబాటులో ఉన్న నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయడానికి సహాయపడుతుంది" అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

అడవుల్లో నీటి కొరత..

మైదాన ప్రాంతాల్లో భూగర్భ లభ్యత మెరుగ్గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే అడవుల్లో ఆ పరిస్థితి లేకపోవడం వల్ల వన్యప్రాణులు అడవులకు సమీపంలోని గ్రామాలకు వచ్చి మరణిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అటవీశాఖ ఒనిపెంట రేంజ్ పరిధిలోని దువ్వూరు మండలం కూడా ఉంది. ఇక్కడి బాకరాయపల్లెకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి, మధ్యలో ఉన్న పొలాలను దాటుకుంటూ ఓ చిరుత పులి గ్రామంలోకి వచ్చింది. గమనించిన కుక్కలు దాడి చేయడంతో ఆ చిరుత పులి ప్రాణాలు విడిచిన సంఘటన సోమవారం మధ్యాహ్నం వెలుగు చూసింది.
"చిరుత పులి మరణించింది" అనే సమాచారం అందుకున్న ఒంటిమిట్ట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నీలాపురం బీట్ ఆఫీసర్ సుచరిత, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (deputy forest range officer DRo) బాకరాయపల్లె గ్రామానికి చేరుకున్నారు. చిరుత పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

"ప్రొటోకాల్స్ ప్రకారం దువ్వూరు పశువైద్యశాలకు తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించాం" అని ఒనిపెంట అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ చెప్పారు. సంఘటనపై ఒనిపెంట డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అన్వర్ హుస్సేన్ ఏమన్నారంటే...
"చనిపోయిన చిరుతపులి కి ఆరు నెలల వయసు ఉంటుంది. తల్లి నుంచి వేరైనా ఆ చిరుత దారి తప్పి గ్రామంలోకి వచ్చినట్లు కనిపిస్తోంది" అని అన్వర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. అడవుల్లో వన్యప్రాణులకు నేటి సదుపాయం కల్పించడంలో కూడా అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన చెప్పారు. అనివార్యంగా వన్యప్రాణులు పల్లెల్లోకి వస్తే సమాచారం అందించే విధంగా ప్రజలను చైతన్యం చేసామని కూడా ఆయన చెప్పారు.
కడప జిల్లా దువ్వూరు మంసంఘటన చిరుత పులి మరణించిన సంఘటన అటవీ శాఖ అధికారులకు ఓ బాధ్యత గుర్తుచేసినట్లే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరి, అడవుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా వన్నె ప్రాణులను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.


Read More
Next Story