బాలిక ప్రాణం తీసిన ప్రేమోన్మాది...
x
కూతురిని మోసుకుని వెళుతున్న తండ్రి

బాలిక ప్రాణం తీసిన ప్రేమోన్మాది...

కడప జిల్లాలో అమానుష ఘటన


ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థి వెంటపడ్డాడు. అతనికితో పెళ్లి చేయడానికి ఆ ఇంటర్ విద్యార్థిని, తల్లిదండ్రలు నిరాకరించారు. ఉన్మాదిగా మారిన డిగ్రీ విద్యార్థి ఆ బాలికను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గొంతు నుంచి రక్తం కారుతున్న కూతురిని కాపాడుకోవాలని ఆ తండ్రి భుజాలపై మోసుకుని వెళుతున్న దృశ్యం చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు కడప- కర్నూలు జాతీయరహదారిపై రాస్తారోకో చేస్తున్నారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటకు చెందిన 16 సంవత్సరాల విద్యార్థిని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి వెంకటేష్
ఆ బాలికను తీవ్రంగా వేధించాలని తెలిసింది. సమీప బంధువు కావడంతో ఆమెతో తనకు పెళ్లి చేయాలని కూడా వారి ఇంటిలో ఘర్షణ పడినట్లు తెలిసింది. కూతుర్ని చదివించుకోవాలనే ఆశతో ఆ బాలిక తల్లిదండ్రులు నిరాకరించారు. కొన్ని రోజులుగా ఈ వ్యవహారం ఆ బాలిక కుటుంబంతో వెంకటేష్ వాదన సాగిస్తున్నట్లు తెలిసింది.

ఇంట్లో ఎవరు లేని సమయంలో..

ఖాజీపేటలోని మోడల్ కాలనీలో ఇంటర్ విద్యార్థిని (16) శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉంది. అదే సమయంలో వారికి సమీప బంధువైన ఆవుల వెంకటేష్ (19) ఆ బాలిక ఇంటి వద్దకు వెళ్లాడు. కత్తితో దాడి చేయడం ప్రయత్నించడంతో ఆమె పెద్దగా కేకలు వేసినట్లు తెలిసింది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉన్మాదిగా మారిన వెంకటేష్ ఆ బాలిక గొంతు కోసి పారిపోయాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆ బాలిక తండ్రి రోధిస్తూ ఇంటి వద్దకు చేరుకున్నాడు.

భుజాలపై మోసుకుని..

కూతురుని బాగా చదివించుకోవాలని భావించిన ఆ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. ప్రేమోన్మాది చేతిలో కత్తి వేటుకు గురైన కూతురిని భుజాలపై మోసుకుంటూ పరుగులుదీశాడు. కూతురి ప్రాణాలు కాపాడుకోవాలని తహతహలాడాడు. కూతురి గొంతు నుంచి రక్తం ధరలు కారుతున్న ధైర్యం చెబుతూ ఖాజీపాట ఆసుపత్రికి అధికష్టం మీద భుజాలపై మోసుకుని వెళ్లిన చూసిన సంఘటన చూసి తీవ్రంగా కలత చెందారు.
అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించడానికి బయలుదేరారు. చెన్నూరు సమీపానికి వెళ్లే సరికి ఆ 16 సంవత్సరాల ఇంటర్ విద్యార్థిని మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

విద్యార్థి సంఘాల ధర్నా

ఖాజీపాటలో ఇంటర్ విద్యార్థినిపై జరిగిన ఘాతుకాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘ నాయకులు రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రేమానుమాదంతో వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిలదీస్తూ రోడ్డుపై బైఠాయించారు. సంఘటన జరిగిన సమాచారం అందిన వెంటనే స్పందించిన కాజీపేట పోలీసులు నిందితుడు వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. విద్యార్థిని హత్య చేసిన ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో నిరసనలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More
Next Story