Courtesy AI
x

పురిటి బిడ్డకు రూ. 50 వేలు వెలకట్టిన తండ్రి...

కడప జిల్లాలో అమానవీయ ఘటన.


బేల్దారి పని చేసే ఓ వ్యక్తి తాగుడుకు బానిస అయ్యాడు. పురిటిలోని మగ బిడ్డకు 50 వేలు వెలకట్టాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నగదు ప్రోత్సాహం ఇస్తారని నమ్మించాడు. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సహకారంతో కొడుకునే మార్కెట్లో విక్రయించాడు. దీనికి ప్రభుత్వాస్పత్రి సిబ్బంది కూడా సహకరించారని సమాచారం. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానని భార్యను బెదిరించాడు. కన్న కొడుకు కోసం ఆ తల్లి అత్తగారింటికి వెళ్లి ఆ తల్లి రోదిస్తూ గొడవపడడంతో ఈ సంఘటన వెలుగు చూసింది.

"డబ్బు కోసమే నా ఐదు వారాల కొడుకును భర్త అమ్మి వేశాడు" అని బాధిత తల్లి లక్ష్మీనారాయణమ్మ కన్నీటి పర్యంతమవుతున్నారు. మళ్లీ బిడ్డ పుడితే అమ్మి వేస్తా అని చాలాసార్లు బెదిరించాడు. తాగిన మైకంలో అలా అంటున్నాడని అనుకున్నా. అన్నంత పనిచేశాడు" అని ఐసిడిఎస్ అధికారులకు లక్ష్మీనారాయణమ్మ ఫిర్యాదు చేసింది. కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవి.
పొద్దుటూరు నియోజకవర్గం చాపాడు మండలం సిద్ధారెడ్డి పల్లె ఎస్సీ కాలనీ చెందిన లక్ష్మీనారాయణమ్మకు మైదుకూరు రెవెన్యూ కాలనీకి చెందిన దండు బాలకుమార్ తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. బేల్దారి పని చేసే బాలకుమార్ మద్యానికి బానిస అయ్యాడు అప్పటికే వారికి ఆరేళ్ల లోపు ఉన్న ఇద్దరు కొడుకులు. నాలుగు సంవత్సరాల కిందట మైదుకూరులోని ఇంటిని బాలకుమార్ అమ్మేశాడు. తాగుడు వ్యసనంతో ఇల్లుగుల్ల చేసుకున్నాడు.

తల్లి ఇంటికి చేరి..

మైదుకూరులో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మీనారాయణ తాగుడుకు బానిస కావడం వల్ల సంసారం దెబ్బతింది. సొంత ఇల్లు కూడా పోయింది. గత్యంతరం లేని స్థితిలో లక్ష్మీనారాయణమ్మ భర్త బాలకుమార్ ఇద్దరు పిల్లలతో చాపాడులోని సిద్ధారెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అప్పటికే ఆమెకు ఆరేళ్ల లోపు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మళ్లీ గర్భం దాల్చిన లక్ష్మీనారాయణమ్మ గత నెల 24వ తేదీ మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మూడో కొడుకుకు జన్మ ఇచ్చింది.

ఇదే అదునుగా బేరం..

లక్ష్మీనారాయణమ్మ, బాల కుమార్ దంపతులకు అప్పటికే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మళ్లీ కొడుకు పుట్టడంతో బాలకుమార్ మైండ్ పక్కదారి పట్టింది. ఐదు నెలల మగ బిడ్డను విక్రయించాలని నిర్ణయం చేసుకున్నాడు. తన కొడుకును విక్రయిస్తానని బాల కుమార్ ఆసుపత్రి వద్ద పాలు విక్రయించే ఓ మహిళకు చెప్పడంతో వెంటనే ఆమె సిబ్బంది కూడా సమాచారం అందించినట్లు తెలిసింది. బాలకుమార్ ఐదు వారాల మగ బిడ్డను విక్రయించడానికి నిర్ణయం జరిగిపోయింది.

ప్రోత్సాహకం పేరుతో ఏమార్చి..

తన ఐదేళ్ల కొడుకును విక్రయించడానికి సిద్ధపడిపోయిన వాళ్ళ కుమార్ ఎత్తు వేశాడు.
"కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కింద నగదు ఇస్తుంది. ఆ విషయం మాట్లాడదామంటూ" తన తల్లి జోజమ్మ తోపాటు భార్య నారాయణమ్మను చెన్నూరు ఆసుపత్రి వద్దకు తీసుకుని వెళ్లాడు.
చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు వెళ్లిన తర్వాత ఐదేళ్ల కొడుకును అమ్మి వేస్తున్నట్లు చెప్పడంతో బాలకుమార్ భార్య లక్ష్మీనారాయణమ్మ, తల్లి జోజమ్మ కూడా అడ్డు చెప్పారు. అత్తా కోడళ్ళ వద్దకు వచ్చిన ఆస్పత్రి సిబ్బంది ఐదేళ్ల మగ పసిగుడును తీసుకెళ్లారు.
"ఇదిగో ప్రభుత్వం 50 వేల రూపాయలు నగదు ప్రోత్సాహం ఇచ్చింది. ఈ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళండి. నేను సాయంత్రం వస్తా" అని భార్య లక్ష్మి నారాయణమ్మ ఒడిలో పడేసి బాలకుమార్ వెళ్ళిపోయాడు. అదే సమయంలో కోడలు లక్ష్మీనారాయణ ఆమె సొంత ఊరు సిద్ధారెడ్డికి పంపేసిన భర్తజోజమ్మ మైదుకూరుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రెండు రోజుల కిందట బాల కుమార్ ఎత్తుగడలు తిరగబడ్డాయి.

బిడ్డ ఎలా ఉన్నాడు..?

ఎంతైనా కన్నతల్లి. కూలి పని చేసే నా బిడ్డను సాగి సంతరించుకుంటుంది. ఐదు వారాల మగ పురిటి బిడ్డ రెండు రోజులుగా కనిపించకపోవడంతో లక్ష్మీనారాయణమ్మ కన్నా పేగు తల్లడిల్లింది. బిడ్డ ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడు అని ఏడుస్తూ మైదుకూరులో ఉన్న అత్తమామల ఇంటికి వచ్చి భోరున రోదిస్తూ..
"నా కొడుకును నాకు ఇవ్వండి.. ఎక్కడ ఉన్నాడో చెప్పండి. పాలు లేక ఎంత తల్లడిల్లుతున్నాడు" అని లక్ష్మీనారాయణమ్మ నిలదీసింది. ఈ తతంగమంతా గమనిస్తున్న చుట్టుపక్కల వారు స్పందించారు. ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో ఆ విభాగం సూపర్వైజర్ ప్రశాంతి రంగ ప్రవేశం చేయడం వల్ల మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.
మైదుకూరు, చెన్నూరు ఆస్పత్రిలో ఏమి జరిగిందనే విషయాలపై ఐసీడీఎస్ సూపర్ వైజర్ ప్రశాంతి బాధిత తల్లి లక్మ్షినారాయణమ్మతో వివరాలు సేకరించారు.
"నా మూడో కొడుకును డబ్బు కోసమే విక్రయించాడు" అని లక్మ్షినారాయణమ్మ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వివరాలు సేకరించిన ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు కూడా సమాచారం ఇస్తామని చెప్పారు.
Read More
Next Story