
నెల్లూరు వద్ద ఘోర ప్రమాదం.. 22 మంది ప్రయాణికులు సురక్షితం
సంగం వద్ద బోల్తా పడిన అనంతపురం ఆర్టీసీ బస్సు. ఐదుగురికి గాయాలు
జాతీయ రహదారులపై ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే యత్నంలో ఆర్టీసీ బస్సు సోమవారం వేకువజామున అనంతపురం ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రాణహాని లేకున్నా, సుమారు ఐదుగురు వరకు గాయపడ్డారు. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి పల్టీ కొట్టడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన నెల్లూరు జిల్లాలో శనివారం ఉదయం జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
అనంతపురం నుంచి 22 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి పది గంటలకు 6682 నంబర్ సర్వీసు ఏపీఎస్ఆర్టీసీ బస్సు నెల్లూరుకు బయలుదేరింది. తాడిపత్రి, పొద్దుటూరు. మీదుగా బద్వేల్ నుంచి నెల్లూరు కు వెళ్లాలి. ఈ బస్సు శనివారం వేకువజామున నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. కోలగుట్ల గ్రామానికి సమీపానికి వచ్చేసరికి, ఎదురుగా వచ్చిన లారీని తప్పించే యత్నంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి పల్టీలు కొట్టి పడిపోయింది. ఈ సమయంలో బస్సులోని ప్రయాణికులు ఉలిక్కిపడి ఏమి జరిగిందనేది తెలియని స్థితిలో ప్రాణ భయంతో కేకలు వేశారు. బస్సు పార్టీలు కొట్టిన కారణంగా ప్రయాణికులు ఒకరిపై మరొకరు పడ్డారు. ప్రాణ భయంతో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. బస్సు వెల్లకిలో పడిపోవడంతో సుమారు ఐదు మందికి పైగానే గాయపడినట్లు సమాచారం అందింది. కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయాలకు గురయ్యారు.
లారీ అడ్డు రావడంతోనే..
"ఎదురుగా లారీ దూసుకుని రావడంతో బ్రేక్ వేయడం వల్ల బస్సు అదుపు తప్పింది" అని అనంతపురం డిపోకు చెందిన ఆ బస్సు డ్రైవర్ పోలీసులకు చెప్పారు. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులను కిటీకీల ద్వారా కొందరిని, డ్రైవర్ ఎదురుగా ఉన్న అద్దం పగిలిపోవడంతో ఇంకొందరిని బయటికి తీసుకుని రావడంలో ప్రయాణికులే ఎవరి వారు సహకారం అందించుకున్నట్లు తెలిసింది. ప్రమాదం నుంచి డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమాచారం అందుకున్న సంఘం మండల పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన నుంచి సంగం పోలీసులు వివరాలు సేకరించారు. 108 వాహనానికి కూడా సమాచారం అందించారు. గాయపడిన ప్రయాణికులను నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరగడానికి దారి తీసిన పరిస్థితి ఏమిటనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

