టీటీడీ ట్రస్టులకు విరాళాల వెల్లువ..
x

టీటీడీ ట్రస్టులకు విరాళాల వెల్లువ..

మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కూతురు రూ. పది లక్షల విరాళం.


టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు దాతల నుంచి శనివారం కూడా పెద్దమొత్తంలో విరాళాలు అందాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు, పేద రోగులు, గోవుల సంరక్షణ కోసం దాతలు టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ద్వారా విరాళం డీడీలు అందించారు.

టీటీడీ విద్య, వైద్యం, అన్నదాన పథకాలను కూడా అమలు చేస్తోంది. వాటిలో దాతల విరాళాలతో నిర్వహించడానికి తొమ్మిది ట్రస్టులు ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రముఖులు శనివారం పెద్ద సంఖ్యలో వివిధ పథకాలకు విరాళాలు అందించారు.

ప్రాణదాన ట్రస్టుకు


ధార్మిక కార్యక్రమాలతో పాటు టీటీడీ పేద రోగులకు మెరుగైన వైద్యం, ఉచిత సేవలు అందించడానికి ఎస్వీ ప్రాణదాన ట్రస్టు నిర్వహిస్తోంది. ఈ ట్రస్టుకు టీటీడీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్ రూ.10 ల‌క్ష‌లు విరాళం డీడీ అందించారు. విరాళం డిడిని తిరుపతిలోని ఈఓ బంగ్లాలో టీటీడీ ఈఓ ఎం.ర‌విచంద్ర‌కు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూడా ఉన్నారు.
టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి
చందనా బ్రదర్స్
టెక్ట్స్ టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం రూ.10,01,116 విరాళంగా అందించింది.

బెంగుళూరుకు చెందిన క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,00,116 విరాళంగా అందించింది. ఆ సంస్థల ప్రతినిధులు తిరుమలలోని ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలు అందజేశారు.

గోవుల సంరక్షణ కోసం

తిరుపతి, తిరుమలలో టీటీడీ గో సంరక్షణశాల కూడా నిర్వహిస్తోంది. దీని కోసం ఏర్పాటు చేసిన ఎస్వీ గో సంరక్షణ ట్రస్టు (SV Cow Protection Trust కు నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ ర‌మాకాంత్ శెట్టి శ‌నివారం రూ.20 ల‌క్ష‌లు విరాళం అందించారు.

విరాళం డిడిని తిరుపతిలోని ఈఓ బంగ్లాలో టీటీడీ ఈ ఎం.ర‌విచంద్ర‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ బోర్డు స‌భ్యుడు జి. భానుప్ర‌కాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Read More
Next Story