తిరుమలలో ఉగాది “స్వర సంగమం” ఎలా సాగిందంటే..
x
తిరుమల నాదనీరాజనం వేదికపై డ్రమ్స్ శివమణి, శంకర్ మహదేవన్ స్వర సంగమం

తిరుమలలో ఉగాది “స్వర సంగమం” ఎలా సాగిందంటే..

యాత్రికులను మైమరిపించిన డ్రమ్స్ శివమణి, పాటలతో శంకర్ మహదేవన్


తెలుగువారి లోగిళ్లన్నీ ఉగాది ఉషస్సుతో కళకళలాడాయి. తిరుమల తోపాటు తెలుగు వారంతా తెలుగు నూతన సంవత్సరాన్ని సంప్రదాయబద్ధంగా స్వాగతించారు. శ్రీవారి సన్నిధిలో గురువారం ఉదయం ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట నాదనీరాజనం వేదికపై “స్వర సంగమం” భక్తి సంగీత కార్యక్రమం యాత్రికులను ఓలలాడించింది.


పద్మశ్రీ డాక్టర్ శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) సుమధుర గీతాలు ఆలపిస్తుండగా, విభిన్న వాయిద్య పరికరాలపై సంగీత ధ్వనులతో పద్మశ్రీ డ్రమ్స్ శివమణి ( Drums Sivamani's)తిరుమల గిరులను హోరెత్తించారు. గురువారం రాత్రి శ్రీవారికి వాయిద్య విన్యాసాలు, మధుర గీతాలతో తిరుమల గిరులు పులకించాయి.

తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న నాదనీరాజనం వేదిక నుంచి పద్మశ్రీ డాక్టర్ శంకర్ మహదేవన్ స్వరార్చన, డ్రమ్స్ శివమణి సంగీత వాయిద్యంతో ఆకట్టుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం మాంత్రికులను సంగీత తరంగాల్లో తేలియడేలా చేసింది.

తిరుమలలో దాదాపు కొన్ని గంటలపాటు సాగిన "స్వర సంగమం" శ్రీవారి ఆలయం ఎదుట నేలపైనే కూర్చొన్న యాత్రికులు ఆద్యంతం సంగీత కచేరీని ఆస్వాదించారు. యాత్రికులతో పాటు టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కూడా సంగీత కార్యక్రమాలకు ముగ్ధులయ్యారు.

తిరుమల నాద నీరాజనం వేదికపై పద్మశ్రీ డాక్టర్ శంకర్ మహదేవన్, డ్రమ్స్ శివమణి ప్రత్యేకతను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి మరోసారి వివరించారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంగీత శిఖామణులు శ్రీవారికి స్వరార్చన చేయడానికి రావడం అభినందనీయం అని అభినందించారు. వారిద్దరికీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పుష్పగుచ్చాలు అందించి, స్వాగతించారు.
"స్వర సంగమం అనే ఈ ప్రత్యేక సంగీత సమ్మేళనం ఉగాది సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక సంగీతానుభూతిని అందించింది" అని వెంకయ్య చౌదరి ఆయన వ్యాఖ్యానించారు.
శాస్త్రీయ సంగీతం, పాప్, ఫ్యూజన్ రంగాల్లో తన ప్రత్యేక శైలితో ఖ్యాతి పొందిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి తమ డ్రమ్స్ వాయిద్యంతో భక్తులను మైమరపించారు. పద్మశ్రీ డాక్టర్ శంకర్ మహదేవన్ తన సుమధుర గాత్రంతో భక్తి గీతాలను ఆలపించి సంగీత ప్రియులను మైమరపించారు. వారికి ప్రముఖ వాద్యకారులు బి.వి. బాలసాయి (ఫ్లూట్), రాజేష్ (మాండలిన్), ఎంబర్ కణ్నన్ (వయోలిన్), ప్రవీణ్ నారాయణన్ (తబల), శాశ్విన్ ఆళ్వార్ (కీబోర్డు)తో సహకారం అందించారు.

తిరుమల నాదనీరాజనం వేదిక పై కార్యక్రమం ముగిసిన తరువాత వారందరికి పుష్పగుచ్చాలు అందిచిన టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి కళాకారులను సత్కరించారు.
Read More
Next Story