MURDER
x
దంపతులు శ్రీను, ఝాన్సీ

ఈమె పేరు 'ఝాన్సీ', భర్తను ఎలా హతమార్చిందంటే..

దోర్నాల క్రైమ్ స్టోరీ: ముగ్గురు బిడ్డల తల్లి, ప్రియుడి కోసం కట్టుకున్న వాణ్ణి కడతేర్చడం కోసం రూ.2 లక్షల సుపారీ


రోగితో పాటు వచ్చిన సహాయకుడికి ఆయాతో అక్రమ సంబంధం వద్దని హెచ్చరించిన పెద్దమనిషిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఘటన మరువక ముందే ఇవాళ తన ప్రియుడి కోసం ఓ ముగ్గురు బిడ్డల తల్లి కట్టుకున్న భర్తను కడతేర్చి పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. ఆమె పేరు ఝాన్సీ. ఊరు దోర్నాల. ప్రకాశం జిల్లా.
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కోపంతో, కట్టుకున్న భర్తను భార్యే తన తమ్ముడితో కలిసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రేమ కాస్తా పగగా మారిందా...

దోర్నాలకు చెందిన లాలు శ్రీను, సున్నిపెంటకు చెందిన ఝాన్సీలకు 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పని చేసే శ్రీను, చెడు వ్యసనాలకు అలవాటు పడి, గంజాయి అమ్ముతూ రెండు నెలల క్రితం పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్లాడు.
అయితే, భర్త జైలులో ఉన్న సమయంలో ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడైన సూర్యనారాయణ అనే కారు డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది.
ముందుగానే రచించిన మరణ శాసనం
జైలులో ఉన్న భర్తను కలవడానికి ఝాన్సీ, ఆమె తమ్ముడు వెళ్లినప్పుడు.. "బయటకు వచ్చాక మిమ్మల్ని చంపేస్తా" అని శ్రీను వారిని బెదిరించాడు. దీంతో భయం వేసిన ఝాన్సీ, అతను బయటకు రాకముందే తానే అతన్ని అంతం చేయాలని ప్లాన్ వేసింది. భర్తను చంపడానికి గుంటూరుకు చెందిన నలుగురు రౌడీలకు రూ. 2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది.

హత్య జరిగిందిలా..

శ్రీను జైలు నుంచి బెయిల్‌పై వస్తున్న రోజునే నిందితులు తమ ప్లాన్ అమలు చేశారు. ముందుగా చీమకుర్తి దగ్గర లేదా పొదిలి దగ్గర చంపాలనుకున్నారు కానీ కుదరలేదు. చివరకు పెద్దారవీడు దగ్గర ఉన్న అంకాలమ్మ గుడి సమీపంలో, మూత్ర విసర్జన కోసమని కారు ఆపించారు.
శ్రీను కారు దిగగానే, వెనుక బైక్‌పై వస్తున్న సూర్యనారాయణ, అతని గ్యాంగ్ శ్రీను కళ్లలో కారం కొట్టారు.
కళ్లలో కారం పడి శ్రీను విలవిలలాడుతుండగా, కారులో సిద్ధంగా ఉన్న భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు కలిసి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు.
పోలీసుల వేట
హత్య చేసిన తర్వాత, మిగిలిన నిందితులు ఝాన్సీని, ఆమె తమ్ముడిని పోలీసులకు లొంగిపొమ్మని సలహా ఇచ్చారు. "మీరు లోపలికి వెళ్తే మేము బయట ఉండి బెయిల్ ఇప్పిస్తాం" అని నమ్మించారు. దీంతో భార్య, తమ్ముడు పోలీసులకు చిక్కారు.
ప్రస్తుతం పోలీసులు వీరిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న సూర్యనారాయణను, మిగిలిన నలుగురిని పట్టుకునే పనిలో ఉన్నారని డీఎస్పీ నాగరాజు వెల్లడించారు.
నేటి సమాజంలో క్షణికావేశాలు, అక్రమ సంబంధాలు ఎలా నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
Read More
Next Story