
Kadapa | మేము పోతున్నాం.. పిల్లలు జాగ్రత్త.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ..
రాయచోటిలో దంపతుల ఊపిరి తీసిన క్రికెట్ బెట్టింగ్?
శక్తికి మించిన అప్పులు చేశారు. అసలు తీర్చడం కాదు. కనీసం వడ్డీ చెల్లించలేని పరిస్థితి, క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు ఆడబిడ్డలు అనాథలుగా మారారు. చనిపోవడానికి ముందు ఆ దంపతులు ఓ సెల్ఫీ వీడియా తీసుకున్నారు.
"ఆ వీడియోలో నాలుగేళ్ల కూతురు. ఆరు నెలల పసిపాపను ఉద్దేశించి "జాగ్రత్త" అని ఆ వీడియోలో వ్యాఖ్యానించడం ఆ వీడియో అందరినీ కలచివేసింది. దీనవదనంతో కనిపిస్తున్న వారి ముఖాల్లో పిల్లలను వదిలి వెళుతున్నామనే బాధతో పాటు, వేదన కూడా కళ్లలో కనిపించింది. కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఈ సంఘటన గ్రామస్తులనే కాకుండా, బంధువులను కూడా తల్లడిల్లేలా చేసింది.
రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం శెట్టివారిపల్లెకు చెందిన మారువేణి మల్లికార్జున (35), రాణి (30) దంపతులకు ఇద్దరు కుమార్తులు ( మూడున్నర సంవత్సరాలు, ఆరు నెలల పాప ఉన్నారు) ఇంటి నిర్మాణానికి అని కొందరు చెబుతుంటే, క్రికెట్ బెట్టింగ్ లో ఆ వ్యక్తి సుమారు రూ. 40 నుంచి 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిళ్లు, వడ్డీ కట్టలేని స్థితిలో వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై గాలివీడు ఎస్ఐ నరసింహరెడ్డి మాట్లాడుతూ..
"మృతుడి తల్లి మారునేని లక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. క్రికెట్ బెట్టింగ్ లో భారీగా నగదు కోల్పోయాడని ప్రాధమిక తెలిసింది" అని ఎస్ఐ ఎస్ఐ నరసింహారెడ్డి చెప్పారు.
గడ్డిమందు తాగి..
చేసిన అప్పులు తీర్చే మార్గంలేని స్థితిలో మారువేణి మల్లికార్జున, రాణి దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుడి తల్లి లక్ష్మేదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరు గడ్డి మందు తాగిన విషయం తెలియగానే చికిత్స కోసం కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో భర్త... శనివారం మధ్యాహ్నం చనిపోడు. ఆయన భార్య రాత్రి చనిపోయింది. వారి మృతదేహాలకు కర్నూలు ఆస్పత్రిలో పోస్టుమార్టం కూడా పూర్తయిందని గాలివీడు ఎస్ఐ ఎస్ఐ నరసింహరెడ్డి ఆదివారం మధ్యాహ్నం చెప్పారు.
కన్నీరుపెట్టిస్తున్న వీడియో
అప్పులు తీర్చే మార్గంకనిపించని స్థితిలో చనిపోవడానికి ముందు మల్లికార్జున, రాణి దంపతులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులో ఆరు నెలల పాపను, నాలుగేళ్ల కుమార్తెను ఉద్దేశించి "జాగ్రత్త" అని వారు చెప్పిన మాటలు హృదయాలను కలిచి వేసేలా ఉన్నాయి. వారి తొందరపాటు నిర్ణయం వల్ల అన్నెం, పుణ్యం ఎరుగని పసి బాలికలను అనాథలుగా చేసింది. పొత్తిళ్లలో సేదదీరాల్సిన ఆరు నెలల బాలిక తల్లి స్పర్శకోసం పరితపిస్తోంది. కనిపించని అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్లారో అని మూడున్నర సంవత్సరాల మరో బాలిక కళ్లు వెదుకులాడుతున్నాయి. పిల్లలు ఇద్దరినీ అక్కున చేర్చుకున్న అమ్మమ్మ లక్ష్మీదేవి తల్లడిల్లుతోంది. కొడుకు మల్లికార్జున, కోడలు రాణి మృతదేహాల కోసం ఆమె తోపాటు శెట్టివారిపల్లె ఎదురు చూస్తోంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం ఏర్పడింది.
క్రికెట్ బెట్టింగ్ వల్ల మరో కుటుంబం చిన్నాభాన్నమైంది. కాగా, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పుల వాళ్లే వేధించారనే ప్రచారం కూడా జరుగుతోంది. గడ్డి మందు తాగగానే మల్లికార్జున, రాణి దంపతులను చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కడపలో పోలీసులకు పేర్లు కూడా వెల్లడించారని తెలిసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని సమాచారం. అక్కడి చికిత్స తీసుకుంటూ, వారిద్దరూ మరణించారని, కేసు దర్యాప్తు చేస్తున్న గాలివీడు ఎస్ఐ ఎస్ఐ నరసింహారెడ్డి చెప్పారు.
Next Story

