
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద టిడ్కోె గృహసముదాయాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
టిడ్కో ఇళ్లకు విద్యుత్ పొదుపు చేసే పరికరాలు..
తిరుపతి జిల్లా నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. టిడ్కో గృహాలపై విద్యుత్ పొదుపు చేసే ఉపకరణాలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు చేయండని కూడా అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 21 నెలల్లో రెండు విడతల్లో 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.
సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట సమీపంలోని పుదూరుకు సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీటీడీ బోర్డు సభ్యరాలు, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తుడా చైర్మన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకరరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు
నాయుడుపేట మండలం పుదూరు వద్ద నిర్మించిన టిడ్కో గృహసముదాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించడానికి ముందు ఆ ప్రాంతంలో కలియదిరిగారు. మంత్రులు, అధికారులను ఆయన అభినందించారు.
"పార్కులు, వాకింగ్ ట్రాక్ ఇతర మౌలిక సదుపాయాలతో ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్లకు ధీటుగా టిడ్కో గృహ సముదాయాలను నిర్మించారని" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. జీ+3 విధానంతో సకల హంగులు, పూర్తి నాణ్యతతో టిడ్కో గృహాల నిర్మాణం చేయడం ద్వారా 21 నెలల్లో రెండు విడతల్లో 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించిందని ఆయన చెప్పారు.
గృహ నిర్మాణ సముదాయాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రులు, అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
"ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు చేయండి" అనిని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో పొదుపు చేసే విద్యుత్ ఉపకరణాలను అందించేలా ఈఎస్ఎస్ఎల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని చెప్పారు. మొత్తం 10 లక్షల ఇళ్లకు విద్యుత్ పొదుపు చేసే ఉపకరణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Next Story

