Update |కుటుంబీకులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి
x
కడప జిల్టా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పరివట్టం కడుతున్న పండితుడు, పక్కనా నారా భువనేశ్వరిి

Update |కుటుంబీకులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

ఒంటిమిట్టి కోదండరాముడికి ఏడోసారి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు


కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం సమీపంలోని అతిథి గృహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. ఆయన వెంట భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్ కూడా ఉన్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు


సమర్పించనున్నారు. దీనికోసం గట్టి భద్రత మధ్య భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి కోదండరామాలయం వద్దకు వచ్చిన ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఆ తరువాత ఆలయంలోకి వెళ్లిన ఆయనకు వేదపండితులు పరివట్టం కట్టారు. వెండిపళ్లెంలో ఉంచిన పట్టువస్త్రాలను నెత్తిన పెట్టుకుని శ్రీకోదండరామాలయంలోకి వెళ్లారు.

ఏకశిలామూర్తి సీతారామ, లక్షుణుడి మూలమూర్తుల వద్దకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టువస్త్రాలతో బయలుదేరగానే, వెంట ఉన్న ఆయన భార్య నారా భూవనేశ్వరి వెెండి పళ్లెంలో పండ్లు, పూలు, మనవడు మరో వెండి పళ్లెంలో పసుపు, కుంకుమ తీసుకుని అనురసించారు. మందీమార్బలం లేకుండా, ప్రశాంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి వెళ్లారు.


ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం వద్ద శ్రీరామ శ్రీరామనవమి వేడుకలను 2016 నుంచి రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు. శ్రీరామ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలోని రాములవారికి ముఖ్యమంత్రి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.

రాష్ట్ర విభజన తర్వాత 2014లో టిడిపి ప్రభుత్వం ఏర్పడింది. ఒంటిమిట్ట సమీపంలోని అధారవ శతాబ్దానికి చెందిన శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని ఆంధ్ర భద్రాద్రిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. దీంతో 2015 ఏప్రిల్ 30వ తేదీ ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా టిటిడి ఇక్కడ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు శ్రీసీతారామ కళ్యాణం కనుల పండగ నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు టిటిడి పూర్తి చేసింది.

ఏడోసారి పట్టువస్త్రాల సమర్పణ

ఒంటిమిట్ట వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ సంవత్సరం ఏడవసారి శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. కొద్దిసేపటి కిందట ఆయన హెలికాప్టర్లో ఒంటిమిట్టకు చేరుకున్నారు.

హెలిపాడ్ వద్ద టీటీడీ చైర్మన్ డిఆర్ నాయుడు, టిటిడి పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, దర్శన్ తో పాటు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తో పాటు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఒంటిమిట్టలోని అతిథి గృహానికి చేరుకున్న ఆయన ఆ తర్వాత సంప్రదాయ దుస్తులు ధరించి పట్టు వస్త్రాలను తీసుకువెళ్లి కోదండరామిస్వామి వారికి లాంఛనంగా అందించనున్నట్లు టిటిడి అధికారులు చెప్పారు.
Read More
Next Story