
Breaking | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం
విద్యుత్ వైర్లు తగలడం చెలరేగిన మంటల్లో కాలిపోయిన బస్సు...
కడప జిల్లా వేంపల్లె వద్ద ఓ ఆర్టీసీ బస్సు ఆదివారం దగ్ధమైంది. ఈ సంఘటన కొద్ది సేపటి కిందటే జరిగింది. ఈ బస్సు అనంతపురం జిల్లా కదిరి డిపోకు చెందింది. కడప జిల్లా వేంపల్లుకు వచ్చిన ఆర్టీసీ బస్సు 22 మంది ప్రయాణికులతో తిరిగి కదిరికి వెళ్లడానికి బయలుదేరింది.
కడప జిల్లా వేంపల్లె దాటగానే వీరన్నగట్టుపల్లి వద్ద 11 కె.వి విద్యుత్ వైర్లు తగిలడంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ జరిగినట్టు తెలిసింది. దీంతో బస్సుకు వెంటనే మంటలు అంటుకోవడంతో బస్సు మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులో18 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం అందింది. బస్సులో మంటలు చెలరేగడంతో, పొగరావడంతో ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ ఆ బస్సును నిలిపి వేశాడు.
తప్పిన ప్రయాణం
బస్సు నిలిపిన క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తూ, బస్సు నుంచి దూకేయడంతో ప్రాణహాని తప్పిందని తెలిసింది. ఈ సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగప్రవేశం చేశారు. వెంటనే మంటలు ఆర్పడం వల్ల బస్సుకు కూడా చాలా వరకు నష్టం తప్పినట్లు సమాాచారం అందింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

