Breaking | బైకులు ఢీ: భారీ విస్ఫోటం.. ఒకరి సజీవదహనం
x
పీలేరు వద్ద రోడ్డుపై మండుతున్న ద్విచక్ర వాహనాల శకలాలు

Breaking | బైకులు ఢీ: భారీ విస్ఫోటం.. ఒకరి సజీవదహనం

పీలేరు వద్ద ఘటన. ముగ్గురికి తీవ్ర గాయాలు.


ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అంతే ఒక్కసారిగా రోడ్డుపై భారీ విస్ఫోటం. ఒకరి శరీరం పూర్తిగా కాలిపోయింది. మరో ముగ్గురి ఆర్తనాదాలు. చెల్లాచెదురుగా పడిన వాహనాలు. రోడ్డుపై మండుతున్న బైకులు, రోడ్డుపక్క గడ్డిపోచలకు సోకిన మంటలు వెరసి పరిస్థితి దారుణంగా మారిన ఘటన పీలేరుకు సమీపంలో కొద్దిసేపటి కిందట ( సోమవారం రాత్రి) జరిగింది.

రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఈ దృశ్యాలు చూసి కదిలిపోయారు. తీవ్రంగా గాయపడిన యువకుడి నుంచి టార్చిలైట్ల వెలుగులో వివరాలు సేకరిస్తున్న వీడియో వైరల్ గా మారింది. శరీరం మొత్తం కాలిపోవడంతో దుస్తులు కూడా లేని స్థితిలో ఒక యువకుడు మృత్యువుతో పోరాడుతూ కనిపించాడు.
పీలేరు నియోజకవర్గం కలికిరి మండల కేంద్రానికి సమీపంలో సోమవారం రాత్రి హృదయవిదారక సన్నివేశం చూసిన వాహనదారులు కదలిపోయారు. కలికిరి నుంచి కందూరుమార్గంలో సామిగుంటవారిపల్లె వద్ద ఈ సంఘటన జరిగింది.
కలికిరి నుంచి ఇద్దరు ఓ ద్విచక్ర వాహనంలో కంబదూరుకు చెందిన అల్తాఫ్ (18), బావాజీ బయలుదేరారు. రెండు లీటర్ల బాటిల్ లో పెట్రోల్ వెంట తీసుకుని వెళుతున్నారు. సామిగుంటపల్లె నుంచి బైక్ లో అఫ్టాన్ (19) వస్తున్నాడు. ఆ ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ రెండు బైక్ లూపై వారు ఎంత వేగంతో ఉన్నారో తెలియదు. కానీ, ఆ ధాటికి బైకులు ఎగిరి రోడ్డుపై చెల్లి చెదురుగా పడ్డాయి.

పెట్రోల్ అంటుకోవడం వల్లే..


పెట్రోల్ అంటుకోవడంతో పేలిపోయిన ట్యాంకులు శకలాలు ఎగిసిపడినట్లు అక్కడి పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో ఓ బైకులో ఉన్న యువకుడికి మంటలు అంటుకుని దుస్తులు కాలిపోవడంతో శరీరం 90 శాతం కాలిపోయిన స్థితిలో కళ్లలో జీవం పెట్టుకుని రోడ్డుపై పడిపోయాడు. మరో ఇద్దరు కూడా కాళ్లు విరిగిపోవడంతో రోడ్డుపై తల్లడిల్లారు. బాటిల్ లోని పెట్రోల్ అంటుకుని విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోయి, రోడ్డు మొత్తం మంటలు ఎగిసిపడ్డాయి.

అదే సమయంలో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, గ్రామస్తులు బాధితుల వద్ద సమాచారం సేకరిస్తూనే, 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అక్కడి దృశ్యాలు భయానకంగా మారిన స్థితిలో నరకయాతన పడుతున్న యువకుడిని స్ట్రెచర్ పై అతికష్టంపై తరలించారు. కలికిరి సీహెచ్సీసీ నుంచి పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Read More
Next Story