శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం
x
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలోని విగ్రహాలు

శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో హరిధ్రా ఘటనం. ఫోటోలు చెప్పే కథలు..


కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు, శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా నిర్వహించారు.


ఒంటిమిట్ట ఆలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.


ప్రాధాన్యం ఇదీ..

హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు.

కార్యక్రమం విధానం
ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు. పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఒంటిమిట్టలో నిర్వహించిన ఈ కార్యక్రమాలను టీటీడీ డిప్యూటీ ఈఓ ఎ. ప్రశాంతి, డీఈ (ఎలక్ట్రికల్) సరస్వతి, పీఆర్‌ఓ ఎఫ్‌ఏసీ కుమారి నీలిమ, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఒంటిమిట్ట కొదండరాములస్వామివార్లకు టీటీడీ వేదపండితులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాములవారి పాదుకలకు కూడా అంతకుముందు పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మహిళా యాత్రికులు, శ్రీవారి సేవకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.


Read More
Next Story