
అనంతపురం జిల్టా యాడికి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు స్వాగతం పలుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ. అస్మిత్ రెడ్డి,
'అనంత' నుంచి కరువు దూరం చేయడానికి 'త్రిసూత్రం'
తాడిపత్రి:యాడికిలో శ్రీశ్రీ కవితను స్ఫురణకు తెప్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలి. దీనికోసం ప్రజలు మూడు సూత్రాలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్తవ్య బోధ చేశారు. ప్రభుత్వం మరింత పరిశ్రమిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. శ్రీశ్రీ చెప్పిన స్ఫూర్తిదాయక కవితాత్మక మాటలు నీటికి అన్వయించి ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
"పరిగెత్తే నీటిని నడిపించాలి. నడిచే నీటిని నిలపాలి. నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి. భూమిని ఓ జలాశయంగా మార్చుకోవాలి" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఎక్కడ జలాశయాలు ఉంటే వాటిని నింపే బాధ్యత పూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వేములపాడు గ్రామంలో 'జలధార- నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత' పై సోమవారం జరిగిన సభలో మాట్లాడారు.
అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలోనే 30 ఏళ్ల కిందటే ఎన్టీరామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. జిల్లాలో ఇంకుడు గుత్తులు, చెక్ డ్యాములు, తుంపర్ల సేద్యం, సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. రైన్ గన్స్ పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. నీరు మనందరికీ సర్వస్వం అని చెప్పిన ఆయన ఆ వనరులు సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
అనంతలో అనేక యత్నాలు..
కరువు నుంచి కాపాడడానికి రాయలసీమను ప్రధానంగా అనంతపురం జిల్లాను కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. అనేక ప్రయత్నాలతో కరువు పై యుద్ధం చేశాం అన్నారు. అనంతపురం జిల్లాలో గతంలో పదేళ్లలో రెండు సంవత్సరాలు కూడా పంటలు సరిగా పండని స్థితి నుంచి ఉద్యానవన పంటల సాకుకు నిలయంగా మార్చే దిశ మార్చామన్నారు. దీనికోసం
పంట కుంటలు తవ్వించండం, కాలువల్లో పూడిక, చెరువులో మట్టి తీయించడం ద్వారా ఆ ఒండ్రు మట్టి పొలాలకు చేర్చిన విషయాలను గుర్తు చేశారు. తద్వారా చెరువుల్లో నీటి పెరుగుదలకు ఆస్కారం కల్పించామన్నారు. ఈ పనుల్లో బాధ్యత పెంచడానికి 1997 సాగునీటి సంఘాలు ప్రారంభించడానికి ప్రేరణ కల్పించాయన్నారు. దీనిలో రైతుల భాగస్వామ్యం కల్పించామన్నారు ఆ నాటి స్ఫూర్తితో వంద రోజుల్లో భూ గర్భ జాలాల పెంపుదలకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి దన్నుగా నిలవాలని కోరారు.
"అనంతపురం జిల్లాలో చాలాసార్లు పర్యటించాను. రైతులు ఒకసారి నన్ను అడిగారు. కనీసం వేరుశెనగ పంట చేసుకోడానికైనా సహాయం చేయాలని కోరారు. దీంతో ఇక్కడి రైతుల వల్ల ప్రారంభించిన ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్రానికి విస్తరించాం" అని కరువు దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించారు.
"అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసి, నీటి సద్వినియోగం చేశాం. ఎకరాకు సరపడే నీటిని రెండు ఎకరాలకు విస్తరించడానికి మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం. నూటికి 90% సబ్సిడీ. డ్రిప్ ఇరిగేషన్ కూడా అనంతపురం నుంచే ప్రారంభించాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గత పరిస్థితులను నెమరు వేసుకున్నారు.
అనంతపురం జిల్లాలో ప్రారంభించిన మైక్రో ఇరిగేషన్ ( Micro-irrigation) దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. వాజపాయి ప్రధానిగా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ రిపోర్టు అందించడం వల్ల దేశానికి ఆదర్శంగా అమలు చేశారన్నారు. 1.26 లక్షల ఎకరాల్లో ఈ పద్ధతి అమలు చేయడానికి 1.30 వెయ్యి కోట్లు మైక్రో ఇరిగేషన్ కు పెట్టుబడి పెట్టామని వివరించారు.
భూ గర్భ జలాలు పెరగాలి..
రాయలసీమలో ఒకప్పుడు నీటి కోసం కొట్లాటలు జరిగిన విషయాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాజీ సీఎం ఎన్.టీ. రామారావు కాలంలోనే తీసుకుని వచ్చిన హంద్రీ నీవా, గాలేరు, నగరి, తెలుగు గంగ తీసుకుని వచ్చామని చెప్పారు. హంద్రీనీవా కాలువలో నీటి పారుదల వల్ల చెరువులు నింపడం ద్వారా భూ గర్భ జాలాల పెంపుదలకు శ్రద్ధ తీసుకున్నామన్నారు.
"30,628 చెరువులు ఉంటే 20 foa చెరువులను పూర్తిగా నీటితో నింపాం. 2025లో 10.62 మీటర్లు లోతులో ఉన్న భూగర్భ జలాలు 8.7 మీటర్లకు తగ్గించాం. 1.92 మీటర్స్ నీటి జనాల శాతం పెరిగింది. భూగర్భ జలాల పైకి వచ్చాయి. 40 శాతం రాష్ట్రంలో 3.8 మీటర్ల ఉంది. 24 శాతం ప్రాంతాల్లో మూడు మీటర్ల కింద ఉంది. మిగిలింది 8 మీటర్ల లోతులో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 2024లో 11.25 మీటర్లకు తగ్గింది. రిజర్వాయర్లలో నీరు ఉండడం వల్ల ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఈ పరిస్థితి ఇంకా మెరుగు పడాలి" అని నీటి సంఘాలకు సూచించారు. నీటి భద్రత కోసం అనేక ప్రయోగాలు చేసామనీ, అన్నమయ్య జిల్లాలో జలాల కింద ఒకే సంవత్సరం 8 మీటర్లలో పెంచిన విధానం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన రైతులు, అధికారులకు ప్రత్యేకంగా సూచించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ (అనంతపురం), బీకే పార్ధసారధి (హిందూపురం, ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూర రెడ్డి తోపాటు అధికారులు స్వాగతం పలికారు.
Next Story

