
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన గంధం అరుణ
ప్రరవే రాష్ట్ర కార్యదర్శిగా గంధం అరుణ
కర్నూలు రాష్ట్ర మహాసభలో ఎంపిక
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్ర ర వే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ గంధం అరుణ ఎంపికయ్యారు. ఆ సంఘం జాతీయ కమిటీ ప్రతినిధులు మంగళవారం ఈ విషయం ప్రకటించారు. కర్నూలులోని కెవిఆర్ కళాశాలలో ఈ నెల ఏడో తేదీ నుంచి రెండు రోజుల పాటు వేదిక రాష్ట్ర మహాసభలు జరిగాయి. మహాసభల సందర్భంగా అదే రోజు కమిటీ ప్రకటించడం ఆనవాయితీ. కమిటీ ఏర్పాటుపై స్పష్టత రాకపోవడంతో రెండు రోజుల అనంతరం కమిటీ ప్రకటించారు. జాతీయ కమిటీ తోపాటు రెండు రాష్ట్రాల కమిటీలను ప్రకటించారు. కర్నూలు జిల్లాకు చెందిన రాయలసీమ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంధం అరుణను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.
జాతీయ కమిటీ వివరాలు
2026 – 28 రెండు సంవత్సరాలకు జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు. తెలంగాణ నుంచి మరో ఇద్దరిని నియమించారు. ఒకరిని గిరిజన ప్రతినిధిగా ఎన్నుకున్నారు.
జాతీయ అధ్యక్షురాలుగా తిరునగరి దేవకీదేవి, కార్యదర్శి గా కె ఎన్ మల్లీశ్వరిని ఎన్నుకున్నారు. జాతీయ సమన్వయకర్త గా కాత్యాయనీ విద్మహే, కోశాధికారి గా అమరజ్యోతి, గిరిజన ప్రాతినిధ్యం కుంజా కళ్యాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఏపీ శాఖ
రాష్ట్ర అధ్యక్షులుగా పి. రాజ్యలక్ష్మి, కార్యదర్శి, డాక్టర్ అరుణ గంధం, సమన్వయకర్త గా కావూరి శారద, నియామక ప్రతినిధిగా జహా ఆరాను నియమించినిట్లు జాతీయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా భార్గవి బెజ్జం, వైష్ణవి శ్రీ, డిఎల్, సుహాసిని, మందరపు హైమవతిని ఎన్నుకున్నారు.
తెలంగాణ శాఖ రాష్ట్ర
అధ్యక్షులుగా శాంతి ప్రబోధ , కార్యదర్శిగా కనీజ్ ఫాతిమా, సమన్వయకర్త గా ఎం. శ్యామల, నియామక ప్రతినిధిగా యాకమ్మ ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా సింగరాజు రమాదేవి, షెహనాజ్ ఫాతిమా, పాత శ్రీలక్ష్మి ,నీలలను ప్రకటించారు.
Next Story

