
కాశీ వద్ద గాయపడిన అనంతపురం జిల్లా యాత్రికులు
Breaking | కాశీ యాత్రలో 'అనంత' యాత్రికులకు విషాదం
బస్సును ఢీకొన్న టిప్పర్. అనంతపురం జిల్లా బి. యాలేరుకు చెందిన ఏడుగురు యాత్రికులకు గాయాలు.
అనంతపురం జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బృందం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి National Highway 135A ( పాత దారి ఎన్ హెచ్ 2) రోడ్డు పక్కన బస్సు ఆపి, వంట చేస్తుండగా, టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అనంతపురం జిల్లాకు చెందిన యాత్రికులు గాయపడ్డారు.
కాశీకి సమీపంలోని గోపిగంజ్ టోల్ గేట్ కు 59 కిలోమీటర్లు దూరంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్, ఆగకుండా వెళ్లిపోయింది. గాయపడిన బాధితులను బస్సు డ్రైవర్ ఆస్పత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో గోపిగంజ్ వద్ద NH-135A (పాత NH-2) మీద గోపిగంజ్ టోల్ ప్లాజా ఉంది. ఇది వారణాసి - అలహాబాద్ (ప్రయోగ్‌రాజ్) మార్గంలో ప్రయాణించే వాహనాలకు ముఖ్యమైన టోల్ ప్లాజా.
ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ నుంచి సమాచారం తెలిసిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ను అప్రమత్తం చేశారు.
"కాశీలోని తన సహచర ఐఏఎస్ అధికారి, మిత్రుడైన కలెక్టర్ తో మాట్లాడాను. బాధితులకు మెరగైన వైద్య సదుపాయం అందించడానికి, మిగతా వారందరినీ క్షేమంగా తీసుకుని రావడానికి చర్యలు తీసుకుంటున్నాం" అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ చెప్పారు. ఈ సంఘటన వివరాలు ఇవి.
అనంత నుంచి కాశీ యాత్రకు..
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజవవర్గం ఆత్మకూరు మండలంలోని బి. యాలేరు నుంచి 48 మంది మహిళలు, పురుషులు కాశీ యాత్రకు వెళ్లారు. అక్కడ పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం అనంతపురం తిరుగు ప్రయాణం అయ్యారు. యాత్రకు వెళ్లిన బృందంలోని వారు హోటల్లకు వెళ్లకుండా, వంటలు తయారు చేసుకోవడానికి సామగ్రి కూడా తీసుకుని వెళ్లారు. ఆ ప్రయత్నంలో...
ఆగిన బస్సును ఢీకొన్న టిప్పర్...
కాశీ యాత్ర ముగించుకున్న యాత్రికులు తిరుగు ప్రయాణం అయ్యారు. సోమవారం రాత్రి కాశీ గోపిగంజ్ టోల్గేట్ ( Kashi Gopiganj Tollgate) కు 59 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన బస్సు ఆపారు. మహిళలు వంట పనుల్లో ఉన్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి, అనంతపురం యాత్రికుల బస్సును ఢీకొంది. ఈ ధాటికి సమీపంలో వంట చేస్తున్న వారిపైకి టిప్పర్ దూసుకుని రావడంతో ఏడుగురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన యాత్రికుల బస్సు డ్రైవర్ గాయపడిన వారిని సమీపంలోని గోపీగంజ్ ఆస్పత్రికి తరలించారని సమాచారం అందింది. ఈ లోపు ప్రమాదానికి గురి చేసిన టిప్పర్ ఆగకుండా వెళ్లిపోయింది. యాత్రికులను కాపాడేందుకు బస్సు డ్రైవర్ శ్రద్ధ తీసుకున్నారు. అదే సమయంలో రాప్తాడు టీటీడీ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు సమాచారం అందించారు.
"గాయపడిన యాత్రికులకు ధైర్యం చెప్పాను. వారందరినీ పరామర్శించాను. గాయపడిన యాత్రికులతో కూడా మాట్లాడాను" అని ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ కు సమాచారం ఇచ్చిన వెంటనే ఆయన కూడా స్పందించారని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.
కాశీ యాత్రకు వెళ్లిన యాత్రికులు గాయపడిన సమాచారం తెలియగానే అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ స్పందించారు. గోపీగంజ్ కలెక్టర్ పవన్ కుమార్ సిన్హాతో మాట్లాడారు.
"బాధితులంతా క్షేమంగా ఉన్నారు. ఏడుగురు మాత్రమే గాయపడ్డారు. వారిని స్వస్థలానికి తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. వారి బంధువులు, గ్రామస్తులు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారందరినీ వారంతా సురక్షితంగా ఉన్నారు" అని ఎమ్మెల్యే సునీత తెలిపారు.
Next Story

