Courtesy AI
x

'పానీ పట్టు' యుద్ధం వద్దు... పాతాళగంగను పైకి రప్పిద్దాం..

అనంతపురం జిల్లాలో ఈ రోజు నీటి సంరక్షణకు వంద రోజుల కార్యాచరణ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


రాష్ట్రంలో ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాల్లో నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. వంద రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనంతపురం జిల్లాలో సోమవారం ప్రారంభించనున్నారు.

తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి నీటి భద్రత - సాగునీటి సంఘాల భద్రత పేరుతో నీటి సంరక్షణ 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
తాడిపత్రి నియోజకవర్గంలోని పెండేకల్లు రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిశీలించనున్నారు. దీనికోసం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర పునరావాస,రీ సెటిల్మెంట్ డైరెక్టర్ పి.ప్రశాంతి, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పరిశీలించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ. అస్మిత్ రెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భూగర్భ జలాల పెంపుదల కోసం..

నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యతలు గుర్తు చేయడానికి వాటర్ బడ్జెట్- వాటర్ ఆడిట్ అనేది కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వేసవిలో నీటి సమస్య రాకుండా, మళ్లీ సీతాకాలం నాటికి భూ గర్భ జలాలు పెంచడమే ప్రధాన లక్ష్యంగా వంద రోజుల కార్యాచరణ ప్రకటించింది.
"వేసవికి ముందు 6 మీటర్లు, వర్ష కాలం తర్వాత 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా యాడికి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇదీ కార్యాచరణ
1. ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు నీటి సంరక్షణకు యాక్షన్ ప్లాన్.
2. ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలి.
3. ఏప్రిల్ 21 నుంచి జూలై 9వ తేదీ వరకు పనులను చేపట్టాలి.
4.జూలై 10 నుంచి 14 జూలై పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి. 60 వేల మంది సాగునీటి సంఘాలను రంగంలోకి దించడానికి తయారు చేసిన కార్యాచరణ అమలు బాధ్యత ఇరిగేషన్, అటవీ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశు సంవర్థక శాఖల సమన్వయం చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు.

ప్రస్తుత స్థితి..

రాష్ట్రంలోని రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయి. గతానికంటే భూగర్భజలాలు పెరిగాయి. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యాలు విధించింది.
"వేసవికి ముందు ఆరు మీటర్లు, వర్ష కాలం తర్వాత మూడు మీటర్ల లోతు" భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సాగునీటి సంఘాలకు సూచించారు.
"ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. కనీసం 1.5 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ పెంచాలి. అన్నమయ్య జిల్లాలో జలధార కార్యక్రమం పేరుతో నీటి భధ్రత, సంరక్షణ చర్యలు" ఆదర్శం అని కూడా గుర్తు చేశారు.
2024 మే నుంచి 2025 మే వరకు 2.20 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో గుర్తు చేశారు. ప్రజాచైతన్యం, ప్రజల భాగస్వామ్యంతో 100 రోజుల ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సాగునీటి సంఘాలకు కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి రైతులతో మమేకం కావడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
Read More
Next Story