కమనీయ దర్శనం... పసందైన అన్న ప్రసాదాలు..
x
ఒంటిమిట్ట వద్ద అన్నప్రసాదాల్లో పులిహోరా ప్యాక్ చేస్తున్న శ్రీవారి సేవకులు

కమనీయ దర్శనం... పసందైన అన్న ప్రసాదాలు..

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం తర్వాత యాత్రికులకు టిటిడి కానుక.


కడప జిల్లా ఒంటిమిట్టలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగే రాములోరి కళ్యాణానికి వచ్చే యాత్రికులకు కమనీయ దృశ్య కావ్యాలను చూపించడం. తిరిగి వెళ్లేటప్పుడు పసందైన అన్నప్రసాదాలతో ఉన్న బ్యాగు అందించడానికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. సీతా,సమేత శ్రీకోదండరామ స్వామి వారి కళ్యాణానికి వచ్చిన వారందరికీ అపురూప కానుకగా అక్షింతల కవర్ కూడా ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేయడానికి తిరుమల నుంచి దాదాపు 90 వేల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కూడా సిద్ధంగా ఉంచింది. ఒంటిమిట్టకు సుమారు లక్ష మంది వరకు వస్తారని అంచనా వేసిన టీటీడీ యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.

"యాత్రికులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడం. పులిహోర, అరటిపండు, ఒక వాటర్ బాటిల్, రూ 50 రూపాయల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఉన్న బ్యాగు సిద్ధం చేశాం" అని టిటిడి (Tirumala Tirupati devasthanam TTD) అదనపువ్వు సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాకు చెప్పారు. ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాములువారి కళ్యాణం నిర్వహించడానికి టిటిడి వేద పండితులు శుభ ముహూర్తంగా నిర్ణయించారు.

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద జరుగుతున్న వార్షిక శ్రీరామ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణోత్సవ ఘడియలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. సీతారాముల వారి కళ్యాణం తోపాటు యాత్రికులకు అందించాల్సిన అన్నప్రసాదాల బ్యాగు, అక్షింతలు, ఒక ముత్యం, పసుపు కంకణాల ఉంచిన కవర్ల సిద్ధం చేశారు.
తిరుమల నుంచి రెండు రోజుల కిందటే రూ 50 రూపాయలు విలువైన 90 వేల శ్రీవారి చిన్న లడ్డూ ప్రసాదాలను ఒంటిమిట్టకు తరలించారు. సీతారాముల కళ్యాణం తర్వాత వచ్చిన యాత్రికులకు ఈ లడ్డు ప్రసాదం ఒక్కొక్కటి పంపిణీ చేయడానికి టిటిడి ఒంటిమిట్ట వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది.

తిరుమల తరహాలో ఏర్పాట్లు...


ఒంటిమిట్ట వద్ద బుధవారం ఉదయం నుంచి జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి చీఫ్ పిఆర్ఓ తలారి రవి, తిరుపతి టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం తో కలిసి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వయంగా పరిశీలించారు.

"టీటీడీ ప్రత్యేకంగా బ్యాగులు తయారు చేయించింది. పులిహోర నింపిన బాక్స్ తోపాటు ఒక వాటర్ బాటిల్, తినుబండారాలతో ప్యాకింగ్ చేయించాం" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యతతో పాటు మంచి అరటి పండ్లు కూడా తెప్పించామని ఆయన చెప్పారు.
తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్యాన్ని ఒంటిమిట్ట వరకు విస్తరించారు. మూడు పూటలా ఇక్కడ వెయ్యి నుంచి 1500 మందికి నిత్య అన్నదానం ద్వారా అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు. ఈ వంటశాలలోని అన్న ప్రసాదాలు సిద్ధం చేశారు.

2,500 మంది శ్రీవారి సేవకులు


శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద నిర్వహించే కల్యాణోత్సవానికి హాజరయ్య యాత్రికులకు విశేష సేవలు అందించడానికి 2500 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచామని టిటిడి చీటీఆర్ఓ తలారి రవి చెప్పారు. వారిలో అన్న ప్రసాదాల ప్యాకింగ్ కవర్లు సిద్ధం చేయడానికి దాదాపు 500 నుంచి 600 మంది శ్రీవారి సేవకులు అవిశ్రాంతంగా సేవలు అందించారని ఆయన చెప్పారు.
"అన్న ప్రసాదాలు బాక్సుల్లో మహిళా శ్రీవారి సేవకులు నింపితే, అవి సక్రమంగా ఉన్నాయా లేదో పరిశీలించి ఆ బాక్స్ తో పాటు ఇంకొందరు శ్రీవారి సేవకులు బ్యాగుల్లో నింపే కార్యక్రమాలను పూర్తి చేశారు" అని రవి చెప్పారు.

"సీతారాముల కల్యాణోత్సవం జరిగే సమయంలో కళ్యాణ వేదిక వద్ద ఇంజినీరింగ్ విభాగం ద్వారా 121 గ్యాలరీలు తొక్కిసలాటకు ఆస్కారం లేని విధంగా కంపార్ట్మెంటు సిద్ధం చేశాం" అని టీటీడీ తిరుపతి వి.వీరబ్రహ్మం తెలిపారు. ఈ గ్యాలరీలో 50 వేల నుంచి 60 వేల మంది ప్రశాంతంగా కూర్చుని కళ్యాణోత్సవం చూడ్డానికి వీలుగా వస్తే కల్పించినట్లు ఆయన తెలిపారు.
సుమారు మూడు గంటలకు పైగానే సాగే కళ్యాణోత్సవ క్రతువును చూడడానికి ఏ పార్టీకే ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి ఆలయం పరిసర ప్రాంతాలు యాత్రికులతో నిండిపోయాయి. వారందరికీ నిరాటంకంగా మంచినీరు, బిస్కెట్ కూడా సిద్ధం చేశామని టిటిడి అధికారులు తెలిపారు.

"ప్రతి గ్యాలరీ వద్ద కొరత లేకుండా దశల వారీగా యాత్రికులకు శ్రీవారి సేవకుల ద్వారా రవ్వ కేసరి, మైసూర్ పాక్, పులిహోర, చెక్క స్పూన్ ల తో పాటు మూడు లక్షలకు పైగానే వాటర్ బాటిల్ సిద్ధంగా ఉంచారు. రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్ల తో పాటు మంచినీటి ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేసినట్టు టీటీడీ తిరుపతి జేఈవో వీరబ్రహ్మం స్పష్టం చేశారు.
Read More
Next Story