ప్రయివేటు బస్సుల్లోె గమ్యం చేరేదాకా... సందేహమే...
x
ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద సూర్యడు ఉదయించే వేళ దగ్ధం అవుతున్న ప్రైవేటు బస్సు, టిప్పర్

ప్రయివేటు బస్సుల్లోె గమ్యం చేరేదాకా... సందేహమే...

కర్నూలు నుంచి మార్కాపురం ఘటన వరకు...


జాతీయ రహదారులపై కొరవడిన భద్రత

ఇంటర్ సెప్టార్ వాహనాలు అవసరం

రవాణాశాఖకు స్పీడ్ గన్స్ కొరత

ప్రకాశం జిల్లాలో 2018 నాటి నిబంధనలు ఎలా ఉన్నాయి..

తిరుపతి నుంచి పొరుగు రాష్ట్రాలకు రాత్రిళ్లు ప్రయివేటు బస్సులు బయలు దేరుతాయి. వాటిల్లో బయలుదేరే ప్రయాణికులు సూర్యుడు ఉదయించే సమయానికి సురక్షితంగా గమ్యం స్థానం చేరుతామనే గ్యారంటీ లేకుండా పోయింది. జాతీయ రహదారులు, టోల్ ప్లాజాల ( Toll Plaza ) వద్ద ఆధునిక యంత్రాల అవసరం తెరపైకి వచ్చింది. జాతీయ రహదారులపై ఇంటర్ సెప్టర్ వాహనాల ప్రాధాన్యతను కూడా Ap రవాణా శాఖ అధికారులు గుర్తు చేస్తన్నారరు.

ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద గురువారం ఉదయం సూర్యుడు ఉదయిస్తుండగానే ప్రయివేటు బస్సు టిప్పర్ ను ఢీకొట్టింది. రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ఘటనలో ఇప్పటి వరకు సుమారు 20 మంది సజీవదహనం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
2025 అక్టోబర్ లో కర్నూలు నగరానికి సమీపంలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో వేకువజామునే 21 మంది సజీవదహనం అయ్యారు. అప్పటి నుంచి జాతీయ రహదారులపై మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో రూ. వేల కోట్ల రూపాయలతో నాలుగు, ఆరు వరుసల్లో జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. ఈ రహదారులపై ప్రయాణించే వాహనదారుల నుంటో టోల్ ఫీజు వసూలు చేయడానికి ప్లాజాలు ఏర్పాటు చేస్తున్నారు. డబ్బు వసూలు చేయడానికి పటిష్ట నెట్ వర్క్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్న కాంట్రాక్టర్లు, దీనికి అనుమతిస్తున్న జాతీయ రహదారుల శాఖ వాహనాల వేగనియంత్రణకు మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ప్రైవేటు బస్సు ఆపరేటర్ల మృత్యుక్రీడకు రాష్ట్రంలోనే కాదు. అంతరాష్ట్ర సర్వీసులతో ఆటలాడుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బస్సులు ఏపీలో తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నిబంధనలు అతిక్రమణకు చెక్ పెడతాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
2025 నవంబర్ ఒకటో తేదీ శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలంలో సామాజిక పింఛన్ల పంపిణీకి హాజరైన సందర్భంలో చెప్పారు.
"వన్ ఇండియా ఓకే. వన్ టాక్స్ విధానం సరైంది కాదు. ఈ పద్ధతిని సమీక్షించాలి" ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఆ విషయం ఏమైందో తెలియదు.
ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు 15 మంది వరకు సజీవదహనమైన ఘటన ఆందోళనకు గురి చేసింది. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఉదాహరణకు రిజిస్ట్రేషన్ చేయించిన ఆ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధ లేకుండా, ఏపీ నుంచి ప్రయివేటు బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘వన్ ఇండియా వన్ టాక్స్’ ( One India, One Tax )విధానాన్ని ప్రయివేటు ఆపరేటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
కొన్ని అంతర్రాష్ట బస్సు ప్రమాదాలు
1) 2013లో తెలంగాణ మహబూబనగర్ జిల్లాలో బస్సు కాలిపోవడంతో 45 మంది దహనమయ్యారు.
2) 2022లో మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 12 మంది కాలిపోయారు.
3) 2023 మహారాష్ట్రలోని బుల్దానా ప్రమాదంలో 25 మంది చనిపోయారు
4) 2025లో రాజస్థాన్ లోని జైసల్మేర్ బస్సు అగ్ని ప్రమాదంలో 26 మంది మాడిమసైపోయారు.
5) 2025 ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు దగ్గిర బస్సులో లేచిన మంటల్లో 20 మంది భస్మమయ్యారు.
వీటికి కారణాలు విశ్లేషించిన వ్యక్తులంతా ప్రమాదాలుకు అన్ని వైపుల నుంచి లోపాలను ఎత్తి చూపినా ప్రభుత్వ విధానాలను ప్రధాన దోషులుగా నిలబెట్టారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రయివేటు బస్సులను ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాల మధ్య తిప్పుతున్నా నిలువరించలేని పరిస్థితి ఏర్పడింది.
నడపడంలో తిరకాసు ఏమిటనేది ఒకటి, రెండు సందర్భాల్లో 2021 ఫిబ్రవరి 14వ తేదీ కర్నూలు జిల్లా వెల్డుర్తి వద్ద టెంపోను లారీ ఢీకొని 17 మంది మరణించడం, 2013 అక్టోబర్ నెల 30వ తేదీ కర్నూాలు దాటి మహబూబ్ నగర్ వద్ద జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై, 45 మంది సజీవదహనం అయిన సంఘనలు జరిగినప్పుడు తాత్రాలిక హడావుడి మినహా ప్రభుత్వాలు స్పందించిన దాఖలాలు లేవు. 12 సంవత్సరాల తరువాత కర్నూలు వద్ద బస్సు శుక్రవారం దగ్ధం, ఆరు నెలలు కూడా గడవకుండానే మార్కాపురం వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో 15 మంది వరకు సజీవదహనమైన ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు అంతర్రాష్ట్ర సర్వీసుల ఈ అంశం చర్చకు వచ్చింది.
కొన్ని రోజుల కిందట ఏపీఎస్ఆర్టీసీ ఏసీ ఆ బస్సులో ది ఫెడరల్ కరస్పాండెంట్లు ఎస్ ఎస్ వి భాస్కరరావు, వీడియో జర్నలిస్ట్ దినేష్ తో కలిసి చెన్నైకి వెళుతున్నాం. బస్సు చానా నెమ్మదిగా వెళుతున్నట్లు అనిపించింది. ఆ బస్సు అటెండెంట్ నువ్వు వాకబు చేస్తే..
"బస్సు స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు సార్. ప్రమాదాల నివారించడానికి ఈ పద్ధతి మా ఆర్ఎం జగదీష్ అమలు చేస్తున్నారు. ఇంతకుమించి వేగం వెళ్లడం కుదరదు" అని ఆ అటెండ్ నుంచి సమాధానం వచ్చింది.
"మా సీటు వద్దే కాదు. అన్ని సీట్లకు అద్దం పక్కనే పలుచటి సిల్వర్ రేకును కవర్గా చేసి ఒక బోల్టు బిగించిన పొడవాటి కడ్డీని సుత్తిగా తయారు చేసి వేలాడదీసి ఉండడం కనిపించింది"
ఇది ఎందుకని వాకప్ చేస్తే.. ప్రమాదం జరిగితే ఎలాంటి ప్రాణహస్తం జరగకుండా ప్రయాణికులు ఈ సుత్తితో అద్దం పగలగొట్టి బయటపడడానికి ఆస్కారం ఉండాలి. ఏసీ బస్సుకే కాదు. దూరప్రాంతానికి ప్రయాణించే అన్ని బస్సులకు తిరుపతి రీజినల్ మేనేజర్ ఈ ఏర్పాటు చేయించారని ఆ అటెండెంట్ నుంచి సమాధానం వచ్చింది.
మూడున్నర గంటల ప్రయాణానికి తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇంత భద్రత కల్పిస్తే రాత్రిళ్ళు మితిమీరిన వేగంతో ప్రయాణించే ప్రైవేటు బస్సుల వేగానికి కళ్లెం వేయడానికి రాష్ట్ర రవాణా శాఖ ఎన్ని భద్రతా చర్యలు తీసుకోవాలనేది ఆలోచింపచేసే విషయమే.

సమాంతర రవాణా వ్యవస్థ

రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి ప్రైవేట్ ట్రావెల్స్ సమాంతర వ్యవస్థగా మారింది. ఆర్టీసీ సర్వీసులు చాలుతున్నాయో? లేదో? తెలియదు గాని ప్రయాణికులు త్వరగా గమ్యస్థానం చేరాలని ఆత్రుత, వారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు వాహనాలు భారీగా పెరిగిపోయాయి.
తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ సెక్టార్ నుంచి రాష్ట్రంలోనే కాకుండా అంతరాష్ట్ర సర్వీసులుగా ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సులు 201, ఏసీ సీటింగ్ స్లీపర్ 20, ఏసీ కోతులు 251, నాన్ ఏసీ స్లీపర్ బస్సులు 22, నాని ఏసి సీటర్ బస్సులో 53 మొత్తం 326 బస్సులు తిరుపతి సెక్టార్ నుంచి మాత్రమే బయలుదేరుతున్నాయి. ఇక విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే బస్సులు వెయ్యికి పైగానే ఉంటాయి అనేది ఓ అంచనా.
"తిరుపతి నుంచి బయలుదేరే అన్ని ప్రైవేటు బస్సులను వారంలో రెండు సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నాం. మా సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పాటు. ప్రైవేటు బస్సు యాజమాన్యాలను కూడా హెచ్చరిస్తున్నాం" అని ఆర్టీవో మురళీమోహన్ చెప్పారు. తిరుపతి రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (Tirupati regional transport officer RTO) మురళీమోహన్ తో ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధి మాట్లాడారు.

స్పీడ్ డివైజ్ ఉంటుంది..

ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసే 48 సీట్లు లేదా 36 వ్యక్తులు ఉన్న స్లీపర్ కోచ్ బస్ విక్రయించే సమయంలోనే ఆ కంపెనీ షోరూమ్ లో స్పీడ్ లిమిట్ డివైస్ (speed limit device SLD) ఇన్బిల్ట్ చేసిన పరికరం అమరుస్తున్నారు. 2015 వ సంవత్సరం నుంచి ప్రతి బస్సుకు ఈ విధానం అమరులో ఉంది అని ఆర్టీవో మురళీమోహన్ చెప్పారు.
ప్రైవేటు బస్సులకు ఆ కంపెనీల షోరూంలో అమర్చే ఎస్ఎల్డి ఇన్ బుల్ట్ పరికరం పనిచేస్తుందా? లేదా? ఆ స్పీడ్ లాక్ ఓపెన్ చేశారా అనే తెలుసుకునే విధానానికి సంబంధించిన సాంకేతికత రాష్ట్ర రవాణా శాఖ అధికారుల వద్ద లేదని తెలుస్తోంది.

తిరుమల ప్రయాణం ఆదర్శం..

తిరుమలకు వెళ్లడానికి ఓ నిర్దిష్ట పద్ధతి అమలులో ఉంది. అలిపిరి టోల్గేట్ నుంచి తిరుమలలోని జిఎన్సి టోల్గేట్ వద్దకు చేరడానికి 18 km ప్రయాణం చేయాలంటే కచ్చితంగా అర్ధ గంట సమయం టిటిడి రవాణా శాఖ, విజిలెన్స్ సిబ్బంది నిర్ణయించారు. ఆ నిర్దిష్ట గడువుకు లోపల వాహనం కొండపైకి చేరితే ఆటోమేటిక్గా జరిమానా పడడమే కాదు. మళ్లీ ఆ వాహనాన్ని కొండపై అనుమతించని విధంగా బ్యాన్ చేస్తారు.
తిరుమలకు వెళ్లడానికి 18 కిలోమీటర్ల ఘాట్ రోడ్డులో ప్రయాణానికి ఇంత పగడ్బందీ నిబంధనను అమలు చేస్తున్నారు.

జాతీయ రహదారులపై ఎక్కడ..?

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 750 కిలోమీటర్ల దూరానికి సుమారు 10 గంటల ప్రయాణం చేయాలి. తిరుపతి నుంచి బెంగళూరు 120 కిలోమీటర్లు, విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు దాదాపు 16 గంటల ప్రయాణం చేయాలి, చెన్నై వంటి నగరాలకు మూడున్నర గంటల్లో చేరవచ్చు. ఇవన్నీ అంతర్రాష్ట్ర రహదారులను కేంద్ర జాతీయ రహదారుల శాఖ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఆరు లైన్లు నాలుగు లేన్ల రోడ్లను నిర్మించింది. ఈ రహదారులపై వాహనాలను వేగం నియంత్రించే విధానమే లేపడం గమనించదగిన విషయం.
ఈ పరిస్థితిపై తిరుపతి ఆర్టీవో మురళీమోహన్ ఏమంటారు అంటే..
"హైదరాబాద్ ఓఆర్ఆర్ తరహ స్పీడ్ డిటెక్షన్ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల వేగానికి కళ్లెం వెయ్యొచ్చు. ఆర్టీసీ బస్సులే కాదు. ప్రైవేటు బస్సులకు స్పీడ్ లిమిట్ ఇన్బిల్ట్ డివైజ్ ( Built-in Speed Device )ఉంది" అని కూడా ఆర్టీవో మురళీమోహన్ చెప్పారు.
జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కెమెరాలు ఏర్పాటుచేసి కమాన్ కంట్రోల్లో వేగాన్ని పర్యవేక్షించే విధానం ఉండడం మేలు చేస్తుందని కూడా రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.
జాతీయ రహదారులపై టోల్ ఫ్రీజ్ వసూలు చేయడానికి ప్లాజాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనం నుంచి ఫీజు వసూలు చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. కంప్యూటర్లతో పాటు సీసీ కెమెరాలు, మానవురాలు సంబంధించి టాక్స్ వసూలు చేసే సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్ లు ఉన్నారు. ఒక టోల్ ప్లాజా నుంచి మరో టోల్ ప్లాజా కు చేరే సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకునే వ్యవస్థ అందుబాటులో లేదు.

ముఖాలు కడగడం సరే...

రాత్రిళ్ళు బయలుదేరే వాహనాలు ఉదయం గమ్యస్థానంకు చేరుకునే లోపు డ్రైవర్లు నిద్రపోకుండా జాగరుకతతో ఉండాలని కర్నూలు వద్ద అక్టోబర్ 2025లో చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటన గుర్తు చేసింది. కర్నూలు వద్ద రాగానే అటు బెంగళూరు ఇటు చెన్నై మార్గంలో వచ్చే వాహనాలు నిలిపే పోలీసులు డ్రైవర్లకు ముఖాలు కడిగించి, జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నారు. ఇదే విధానం చిత్తూరు, అనంతపురం జిల్లాకు కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో కూడా పోలీసులు అదే పని చేస్తున్నారు.
ఒక విధంగా ఇది మంచి పని అయినా, అసలు విషయాన్ని జాతీయ రహదారుల శాఖ మరిచిపోతున్నదనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రవాణా శాఖకు స్పీడ్ (Speed ​​Guns) గన్స్ గనులు లేవు. 10 లక్షల రూపాయలు విలువైన ఈ పరికరం కొనుగోలు చేసే ఆలోచనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రావడం లేదు. వీటిని వినియోగించాలంటే సిబ్బందికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. ప్రత్యేక వాహనంలో వెళ్లి ఆ స్పీడ్ గన్ రోడ్డుపై ఉంచి నిరీక్షిస్తూ ఉండాలి. దూరం నుంచి డ్రైవర్ గమనించగానే వాహన వేగాన్ని నియంత్రించుకొని ముందు జాగ్రత్త పడిపోతారు. ఈ పరిస్థితిలో వాహనాల వేగ నియంత్రణ కోసం కొన్ని పద్ధతులు అనుసరిస్తే బాగుంటుంది అని తిరుపతి ఆర్టీవో మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.
"ఒక వాహనం ఉదయం 9 గంటలకు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దాటిన తర్వాత మరో ప్లాజా వద్దకు 10 గంటల వరకు చేరింది అనుకోండి. ఆ గంట మీవదిలో ఆ వాహనం ఎంత వేగంతో ప్రయాణించిందనేది కూడా నిర్ధారించవచ్చు" అని ఆర్టీవో మురళి విశ్లేషించారు.

కనిపించని స్పీడ్ గన్స్..

రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు కూడా అంతర్రాష్ట్ర సర్వీసులను నడుపుతున్నాయి. రాయలసీమలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దులుగా ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్, తూర్పుగోదావరి జిల్లాలో పాండిచ్చేరిలోని యానాం ప్రాంతాలకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు వాహనాలు అత్యధికంగా రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం స్పీడ్ గనుల స్థానంలో ఇంటర్ సెప్టార్ ( Interceptor ) వాహనాలను జాతీయ రహదారులపై మోహరిస్తున్నారు. ఆ పరిస్థితి ఏపీలో మాత్రం కనిపించడం లేదు.
చిత్తూరులో ఇంటర్ సెక్టార్ వాహనం ఒకటే ఉంది. ఏడు నుంచి పది లక్షల విలువైన ఈ వాహనంలో రహదారిపై ప్రయాణించే వాహనాల వేగాన్ని ఇట్టే పసిగట్టి చర్యలు తీసుకునేందుకు అవసరమైన పరికరాలన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి.
జాతీయ రహదారులు, అంతరాష్ట్ర రహదారులు ఉన్న జిల్లాలకు రెండు ఇంటర్ సెక్టార్ వాహనాలను కేటాయిస్తే బాగుంటుందని తిరుపతి ఆర్డీవో మురళి అభిప్రాయపడ్డారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన బస్సు దగ్ధం సంఘటన తెల్లవారక ముందే విషాద వార్తను రాష్ట్ర ప్రజలను విషాదానికి గురిచేసింది. బాధితుల కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గ్రానైట్ క్వారీకి సంబంధించిన టిప్పర్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లాలో రవాణా శాఖ 2017 - 18 సంవత్సరాల మధ్య నిర్దిష్ట చర్యలు తీసుకొని వాహనాల వేగానికి కళ్లెం వేసింది. తాను ఒంగోలు ఆర్టీవో గా ఉన్నప్పుడు తీసుకున్న చర్యలను తిరుపతి ఆర్టీవో మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.
"ప్రకాశం జిల్లా అంటే చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ( Cheemakurthi Galaxy Granite ) కు ప్రసిద్ధి. గ్రానైట్ బ్లాక్ తో వచ్చే భారీ వాహనాన్ని ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి పైన తూకం వేస్తాం. అధికంగా ఉంటే యజమానుల కాటాపై మళ్లీ బరువు తోల్చడం ద్వారా వెంటనే ఆ గ్రానైట్ వారి స్థలంలోని అన్లోడ్ చేయిస్తాం"ఈ పద్ధతి నేను అక్కడ ఉన్నప్పుడు అమలు చేశానని ఆర్టీవో మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.
ఒంగోలు నుంచి చెన్నై వెళ్లే మార్గంలో సూళ్లూరుపేట, తమిళనాడు సరిహద్దులో తడ మండల కేంద్రం వద్ద ఇదే తరహా బ్రిడ్జి ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
"ఈ భారీ వాహనాలు టిప్పర్లు లారీల వల్ల ప్రైవేట్ ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాలు జరగకూడదని ఈ విధానం అమలు చేశాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు" అని ఆర్టీవో మురళీమోహన్ చెప్పారు.

చాలని రైళ్లు..

అన్ని రాష్ట్రాల నుంచి తిరుపతి ఆధ్యాత్మిక రాజధానికి రైల్వే మార్గం అనుసంధానంగా ఉంది. తిరుపతితో పాటు పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి అనువుగా సరిపడ రైళ్ల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం తిరుపతి మీదుగా రోజూ 90 నుంచి 95 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. చెన్నై మార్గంలో తిరుపతికి సమీపంలోని రేణిగుంట జంక్షన్ మీదుగా 45 నుంచి 50 రైళ్లు నడుస్తున్నాయి. ఇవికాకుండా, మిగతా ప్రాంతాల వివరాలు పక్కన ఉంచితే తిరుపతి నుంచి హైదరాబాద్ మధ్య రెగ్యులర్ రైళ్లు కాకుండా స్పెషల్ ట్రైన్లు 21 నడుపుతున్నా, ప్రయాణికుల సంఖ్యకు చాలడం లేదు.
"రైళ్ల సంఖ్య పెంచాలంటే తిరుపతి డివిజన్ ఏర్పాటు చేయాలి. దీనికి తగినట్లు రైల్వే స్టేషన్ విస్తరణ జరగాలి. వాటిలో సమానంగా మూడో లైన్ నిర్మాణం తోపాటు కొత్త రైళ్లను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది" అని విశ్రాంత చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్, తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితి ప్రతినిధి కుప్పాల గిరిధర్ అభిప్రాయపడ్డారు.
Read More
Next Story