
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)
తిరుమల: రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. 19న ఉగాది ఆస్థానం
తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది పండుగ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. 16, 18వ తేదీల్లో సిఫారసు లేఖలు అనుమతించడం లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అందువల్ల 6వ తేదీ సిఫారసు లేఖలు తీసుకోరు. ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఈ వేడుకకు ముందు మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవ టీటీడీ రద్దు చేసింది. 16వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో మార్చి 18వ తేదీ విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీడీడీ ఈఓ ఎం. రవిచంద్ర స్పష్టం చేశారు.
Next Story

