
కాల్పుల కలకలం... ఇద్దరు పోలీసులకు గాయాలు...
ఐదేళ్ల బాలుడి కిడ్నాప్, హత్య తరువాత తాడిపత్రి వద్ద ఏమి జరిగింది?
ఓ హత్య కేసు కేసు రీకనస్ట్రక్షన్ ( Case Reconstruction ) చేయడానికి నిందితుడు పోెలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. నిందితుడు దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఇదే సమయంలో పోలీసులు జరిగిన కాల్పుల్లో నిందితుడి కాళ్లకు గాయాలయ్యాయి. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని యాడికి మండల కేంద్రం వద్ద ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితి ఇదీ..
అత్తమామలపై కోపంతో బావమరిది (ఐదేళ్లు)ని కిరాతకంగా ఓ వ్యక్తి చంపేశాడు. అతనిని పట్టుకోడానికి వెళ్లిన పోలీసులపై తిరగబడి దాడి చేశాడు. ఓ సిఐ, కానిస్టేబుల్ గాయపడ్డారు. సీఐ జరిపిన కాల్పుల్లో బామ్మర్దిని అంతం చేసిన వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసు కాల్పులకు దారి తీసిన ఈ సంఘటన నేపథ్యం ఇది.
యాడికి మండలం కోనప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందయ్య, కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. కూలి, నాలి చేసుకుని ఆ కుటుంబం జీవిస్తోంది. ఇదిలావుటే, గోవిందమ్మ కాంతమ్మ దంపతుల కుమార్తె లలిత ఏటూరు గ్రామానికి చెందిన సర్వేష్ కుమార్ తో ప్రేమలో పడింది. కూతురుపై మమకారం, ప్రేమించాడు కదా. తమ బిడ్డను బాగా చూసుకుంటాడని లలితను ఇట్టూరు గ్రామానికి చెందిన సర్వేష్ కుమార్ తో వివాహం జరిపించారు. ఇంతవరకు కథ సుఖాంతంగా సాగింది.
కట్నం కోసం వేధింపులు..
యాడికి గ్రామానికి చెందిన లలితతో వివాహం అయిన తర్వాత సురేష్ కొన్నాళ్లు జీవనం సజావుగానే సాగింది. ఆ తర్వాత డబ్బు కోసం వేధించడం ప్రారంభించాడని లలిత తన తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడింది. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో గత్యంతరం లేని స్థితిలో కొన్నాళ్లుగా లలిత యాడికి గ్రామంలోని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అత్తారింటి వద్ద తనకు మర్యాద చేయడం లేదని ఆగ్రహించిన సురేష్ మెదడులో తొలచిన ఆలోచనలతో ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్వయానా బామర్ది అయిన ఐదేళ్ల బాలుడని బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేశాడు.
"మా కొడుకు సాయంత్రం నుంచి కనిపించడం లేదు" అని గోవిందయ్య, కాంతమ్మ దంపతులు యాడికి మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వారి అల్లుడు సర్వేష్ కుమార్ కూడా వారి వెంటే ఉన్నాడు. తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా సురేష్ అత్తమామలతో కలిసి బామ్మర్దిని గాలించడానికి అత్యంత ఉత్సాహం చూపించినట్లు తెలిసింది. సురేష్ వాలకం గమనించిన సీఐ రామసుబ్బయ్యకు సందేహం వచ్చింది. అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే దిమ్మెర పోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
"బుధవారం సాయంత్రం బామ్మర్ది (ఐదు సంవత్సరాలు) చాక్లెట్లు కొనిస్తా అని నమ్మించి బైక్లో ఎక్కించుకున్నాడు. గ్రామానికి సమీపంలో ఉన్న కుందనకోట గుట్టల్లోకి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి, గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లు" పోలీసుల విచారణలో తేలింది.నాకు ఆ భర్త వద్దు..
తమ్ముడి మృతదేహాన్ని చూసిన లలిత, ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. "ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మంచిగా ఉంటాడంటే నన్ను వేధింపులు గురి చేశాడు. చివరికి నా తమ్ముడు ని కూడా ఫోటో పెట్టుకున్నాడు. ఇలాంటి భర్త నాకు వద్దు" లలిత మీడియా వద్ద తల్లడిల్లింది. నాకు ఇలాంటి భర్త అవసరమే లేదు. నా తమ్ముడిని చంపినట్లే అతనిని కూడా అదే స్థలంలో చంపేయండి అంటూ రోధించింది. ఈ ఘటన గ్రామస్తులను కన్నీరు పెట్టించింది.
పోలీసులు ఎందుకు కాల్పులు జరిపారు..
ఐదేళ్ల బాలుడిని చంపి పడేసిన ఘటనా స్థలానికి అతని బావ సర్వేష్ కుమార్ ను పోలీసులు తీసుకుని వెళ్లారు. ఐదేళ్ల బాలుడిని ఎలా చంపాడనే విషయంలో సీన్ రీ కనెక్షన్ కోసం తీసుకువెళ్లామని సీఐ రామసుబ్బయ్య మీడియాకు చెప్పారు. పోలీసులు ఏమరపాటుగా ఉన్నారని గ్రహించిన సర్వేష్ బీరు బాటిల్తో దాడి చేయడం వల్ల కానిస్టేబుల్ వెంకటేష్ తోపాటు సీఐ రామసుబ్బయ్య కూడా గాయపడ్డారు. నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు కాళ్లపై కాల్పులు జరిపి సీఐ రామసుబ్బయ్య చెప్పారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు సురేష్ తో పాటు అతని దాడిలో తీవ్రంగా గాయపడిన సిఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ ని కూడా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన యాడికి తోపాటు తాడిపత్రిలో చర్చనీయాంశంగా మారింది.
Next Story

