
తిరుపతికి సమీపంలోని శ్రీవకుళామాత ఆలయం (ఫైల్)
తిరుపతిలోనే ఇక బాసర: పిల్లలకు అక్షరాభ్యాసం..
పేరూరు వకుళామాత ఆలయం వద్ద టీటీడీ ఏర్పాట్లు. ముహూర్తమే ఆలస్యం.
మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారా? బాసర తరహాలోనే శ్రీవకుళామాత ఆలయం వద్దకు వస్తే చాలు. బాసర్ శ్రీజ్ఞానసరస్వతి ఆలయంలో మాదిరే మూడు నుంచి ఐదేళ్ల లోపు బాలలకు అక్షరాభ్యాసం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవకుళామాత ఆలయాన్ని టీటీడీ మరో బాసర క్షేత్రం (శ్రీజ్ఞానసరస్వతి )గా తీర్చిదిద్దబోతోంది. వకుళామాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అక్షరగోవిందం పథకాన్ని అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. 300 కిట్లతో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి ప్రణాళిక తయారు చేశారు.
తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ వద్ద కొండపై 17 వ శతాబ్దానికి చెందిన శ్రీవకుళామాత ఆలయం ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారికి స్వయాన తల్లి శ్రీవకుళామాత. ఆ ఆలయాలు కపిలతీర్థం సమీపంలోని మాల్వాడిగుండం దగ్గర ఒకటి. శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణమార్గంలో ఆగ్నేయ దిశలో పోటు ( వంటశాల) వకుళామాత గుడి ఉంది. ఏమి విగ్రహానికి ఎదురుగా కిటికీ లాంటి అర నుంచి ప్రసాదాల తయారీని చూసే విధంగా వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు.
తిరుపతి సమీపంలో మరో బాసర
తిరుపతి నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరు కొండపై శ్రీవకుళామాత ఆలయం 17 వ శతాబ్దం నాటిది. ఈ ఆలయం సంప్రోక్షణ కార్యక్రమాలు 2022 జూన్ 18వ తేదీ నుంచి ఐదు రోజులపాటు నిర్వహించారు. ఆలయం ఉన్న కొండపైకి నడిచి వెళ్లడానికి స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం తో పాటు ఆనంద నిలయాన్ని పోలిన రీతిలో బంగారు తాపడం చేశారు. తిరుమల తరహాలోని ఒకలా మాత ఆలయం ఉన్న పేరూరు కొండపై కూడా యాత్రికులు సులభంగా వెళ్లే విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించారు. కానీ, స్థలం తక్కువగా ఉంటుంది.
ఏడు వస్తువులలో కిట్
తిరుపతికి సమీపంలోని శ్రీవకుళామాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఏడు వస్తువులతో కిట్ టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో పలక బలపాలు, శ్రీవారి అక్షింతకు, అమ్మవారి ఆరు కుంకుమ పాకెట్లు, పటిక బెల్లం (కలకండ) ప్రసాదం పాకెట్ తో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సరస్వతీ దేవి వినాయకుడు ఉన్న చిత్రపటం కానుకగా టిటిడి అందించబోతోంది.
పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్న అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని 300 కిట్లతో టీటీడీ ప్రారంభించే అవకాశం ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి టికెట్ ధర ఎంత వసూలు చేయాలి అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. విధివిధానాలు ఖరారు చేశారు. అమలుకు ముహూర్తం నిర్ణయిస్తారని టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర్ (Basar) వద్ద ఉన్న శ్రీ సరస్వతీ దేవి ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. దేశంలో సరస్వతీదేవి ఆలయాలు కాశ్మీర్ తరువాత బాసరలోని శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమీతులై కొలువు తీర్చారు. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు మాత్రమే.. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతీదేవి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షర కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తారు. దేవస్థానం పాలకమండలి కూడా ఇక్కడ అలాంటి ఏర్పాటు చేసి, ఆర్జిత సేవలు అందుబాటులో ఉంచారు.
బాసరలో...
బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి టిక్కెట్ ధర తీసుకోవాలి.
1. సాధారణ అక్షరాభ్యాసం చేయించాలంటే వంద రూపాయల టికెట్ తీసుకోవాలి. ఆలయ ప్రాంగణంలో సాధారణ విశాలమైన గదిలో మాత్రమే ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.
2. ప్రత్యేక అక్షరాభ్యాసం చేయించాలంటే వెయ్యి రూపాయల టికెట్ కూడా అందుబాటులో ఉంది. ఈ టికెట్ తీసుకున్న వారికి ఆలయంలో అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం కూడా బాసర ఆలయ అధికారులు కానుకగా అందిస్తారు.
3. బాసర అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాస పూజ కార్యక్రమాలు ఉదయం 7:30 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయి. సెలవు రోజుల్లో లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మార్పులు చేస్తూ యాత్రికులకు ఇబ్బంది లేకుండా బాసర ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంటుంది.
4. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వీలుగా టికెట్ కౌంటర్ వద్దే పలక, బలపం అందిస్తారు. గృహస్తులు ఇంటి నుండి పూజ సామాగ్రి తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుంది.. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం పరిమితంగా ఉండడం వల్ల, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే తల్లిదండ్రులు నేరుగా ఆలయానికి వెళుతుంటారు. వసంత పంచమి లేదా ఇతర పర్వదినాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
తిరుపతి వకుళామాత ఆలయం వద్ద
తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవకుళామాత ఆలయంలో కూడా బాసర తరహాలోనే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వీలుగా టిటిడి ఈ కార్యక్రమం అమలు చేయబోతోంది. తిరుమలలో ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఆ మేరకు తీర్మానం కూడా చేశారు. టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్టు లేదా హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిర్వహించాలా? అనే విషయంతో పాటు టికెట్ ధర కూడా ఇంకా నిర్ణయించలేదు.
తిరుపతికి సమీపంలోని శ్రీవకుళామాత ఆలయం వద్ద పైలెట్ ప్రాజెక్టుగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించే కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ (TTD HDpp) సిద్ధం చేసింది. ఇక్కడి ప్రధాన ఆలయం చిన్న కొండపై ఉంటుంది. ఇక్కడ విశాలమైన స్థలం సమస్య కూడా ఉంది.. పేరూరు గ్రామానికి సమీపంలో ఉన్న ఈ కొండ దిగువన అక్షరాభ్యాసం పూజలు నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించారు.
Next Story

