SSC Exams | రేపటి పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా...
x

SSC Exams | రేపటి పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా...

తిరిగి ఏప్రిల్ రెండో తేదీ నిర్వహణ. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారమే...


పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ఫీవర్ వెంటాడుతోంది. శనివారం నిర్వహించాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా వేస్తూ, సెకండరీ విద్య శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ పండుగ కారణంగా ముందుగా ప్రకటించిన టైంటేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.

"రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం (ఈ నెల 21వ తేదీ) నిర్వహించాల్సిన ఇంగ్లీషు పరీక్ష SSC 3rd Language – English పరీక్ష (Paper Code: 13E & 14E) వాయిదా వేస్తున్నాం. ఆ పరీక్ష ఏప్రిల్ రెండో తేదీ నిర్వహిస్తాం" అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

ఇంగ్లీషు పరీక్ష ఏప్రిల్ రెండో తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. డీఈఓలు, ఎంఈఓలకు ఆ మేరకు ఆదేశాలు అందాయి. శనివారం పరీక్షకు హాజరు కావాల్సిన ఇన్విజిలేటర్లు ఏప్రిల్ రెండో తేదీ విధులకు హాజరుకావాలని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మిగతా పరీక్షలు యథావిధిగా నిర్ణీత తేదీల్లో జరుగుతాయి.
మార్చి 23 : గణితం
మార్చి 25 : PS
మార్చి 28 : BS
మార్చి 30 : సోషల్
మార్చి 31 : ఒకేషనల్ పరీక్ష
ఏప్రిల్ 1 : ఒకేషనల్ పరీక్ష
ఏప్రిల్ 2 : ఇంగ్లీష్
Read More
Next Story