
శ్రీశైలం జలాశయం (ఫైల్)
రబీ.. రాయలసీమ రైతుకి శాపమా!
కేసీ కాలువకు నీరు విడుదలతో ఆదుకోవాలంటున్న రైతులు...
రాయలసీమ ఉద్యాన పంటలను ఇరాన్ యుద్ధం ఛిద్రం చేసింది. ఎగుమతులు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. రబీ సీజన్ లో పంటలకు నీటి ఎద్దడి వెంటాడుతోంది. శ్రీశైలంలో నీటి విడుదల ఆపడం, కేసీ కాలువకు నీరు విడుదల చేయకుంటే, పంటలు ఎండిపోవడమే కాదు. తాగునీటికి మరింత కటకట తప్పేలా లేదు.
రాయలసీమలో కేసీ కెనాల్ (కడప కర్నూలు కాలువ) ఆయకట్టు కింద సాకులోని పంటలు, రైతులకు జీవన్మరణ సమస్యగా మారింది. ప్రస్తుత రబీ సీజన్లో పంటల సాగు అనేది సవాల్ గా మారింది. కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేయడానికి శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కనీసం నీటి మట్టానికి దిగువ ఉంటే, నీటిని విడుదల చేయకుండా ఆపడం. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి నీటిని నిల్వ ఉంచడం మినహా మరో గత్యంతరం లేదు.
"శ్రీశైలం ప్రాజెక్టు జల నిర్వహణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు" అని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరధరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
"కేసీ కెనాల్ సంబంధించి అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులకు తోడుగా బచావత్ క్రిమినల్ నిబంధనలు, రాష్ట్ర విభజన చట్టంలోని విధానాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసిన ఆయన నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకోవాలి" అని బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల ఆందోళన ఎందుకంటే
కర్నూలు, కడప జిల్లాల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి వర్షపాతం తక్కువగా నమోదయింది. భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది. అల్పపీడన ప్రభావంతో ఫిబ్రవరి నెలలో కొన్నిచోట్ల అకాల వర్షాలు కురిసిన మార్చిలో పెరిగిన ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సంవత్సరం మార్చి 11వ తేదీ నాటికి కడప జిల్లాలో వర్షపాతం 100% లోటు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో 1.8 మిల్లీమీటర్ల వర్షం కూడా నమోదు కాలేదు. కర్నూలులో సాధారణ వర్షపాతం 2.1 మిల్లీమీటర్లు కాగా ప్రస్తుతానికి చొక్కా వర్షం కూడా కొరవలేదు అనేది అధికారులు చెబుతున్న మాట. ఈ పరిస్థితి సాగులోని పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు రైతులు రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం ఇస్తున్న రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు
ఉరుముతున్న కరువు..
గత ఏడాది అకాల వర్షాలు కురవడం వల్ల ప్రాజెక్టుతో పాటు చిన్నాచితక వనరులన్నీ నీటితో నిండాయి. కరువుకు నిలయంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు 10 నుంచి 15 అడుగుల లోతుకు పడిపోయినట్లు భూగర్భ జల వనరుల శాఖ కూడా స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయం తోపాటు తాగు నీటికీ కటకటలాడే పరిస్థితి మున్ముందు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
కారణం ఇదీ..
రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలో పెరిగిపోవడం, దీర్ఘకాలంగా పొడి వాతావరణం వల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటడానికి దారి తీసినట్లు కూడా చెబుతున్నారు. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లా తోపాటు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లె ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు లోతుకు వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు.
కర్నూలు జిల్లాలో సుమారు 500 అడుగుల లోతు వరకు బోరు బావి తవ్విన నీరు రావడం కష్టంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ జిల్లా ప్రాంతాల్లో వేరుశీనగ, వరి, బొప్పాయి, మామిడి, సపోటా తోటల్లె పూత దశలో కొంతభాగం, కాయ దశలో ఉన్నట్లు రైతుల ద్వారా తెలిసిన సమాచారం.
"ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ నెల వరకు పంటలను కాపాడుకోవడం కష్టమయ్యే విధంగా ఉంది" అని కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన రైతు దోనెప్ప ఆందోళన వ్యక్తం చేశారు.
విభిన్న వాతావరణం
రాయలసీమ జిల్లాల్లో విభిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాలతో పోలిస్తే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఓ మీడియా కథనం ప్రకారం.. కడప జిల్లాలో పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
1. కర్నూలు జిల్లాలో 11 నుంచి 12 మీటర్ల వరకు భూగర్భ జలాలు అడుగంటాయి.
2. నంద్యాల జిల్లాలో పని నుంచి 15 మీటర్లు, కడప జిల్లాలో 14 నుంచి 16 మీటర్లు
3. చిత్తూరు జిల్లాలో మరీ ఎక్కువగా 206 నుంచి 28 మీటర్లు లోతుకు జలాలు అడుగంటినట్లు నివేదికలు చెబుతున్నాయి. 4. అనంతపురం జిల్లాలో కూడా 20 నుంచి 25 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటినట్లు భూగర్భ జల వనరుల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
"జిల్లాలో భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయిలో లేవు. బోరు బావుల్లో నుంచి మీరు సమృద్ధి గానే వస్తోంది" అని కడప జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళి స్పష్టం చేసినట్లు ఆ మీడియా కథనం పేర్కొంది.
కేసీ కెనాల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. నంద్యాల జిల్లా పాణ్యం గడివేముల మండలాల్లో నీటిమట్టం 5.50 మీటర్ల వద్ద ఉంటే గత ఏడాదితో పోలిస్తే 1.5 మీటర్లు మెరుగుదల ఉన్నట్లు భూగర్భజన మనలో శాఖ నివేదిక స్పష్టం చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని, ఆలూరు మండలాల్లో వర్షపాతం లోటు వల్ల నీటిమట్టం పని నుంచి 18 మీటర్ల లోతుకు వెళ్ళినట్లు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. భూగర్భ జల వనరుల శాఖ నివేదికల ప్రకారం మే నెల నాటికి నీటిమట్టాలు మరో 2.5 మీటర్లు మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
కడప జిల్లా కమలాపురం వల్లూరు వీరపునాయునిపల్లె మండలాల పరిధిలో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఐదు నుంచి పది మీటర్ల లోతు పెరగిన పరిస్థితి కడప నగరం తోపాటు చెన్నూరు, చింతకొమ్మదిన్నె మండలాల్లో పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. రాయచోటి నియోజవర్గంలో 15 మీటర్లకు లోతుకు, లక్కిరెడ్డిపల్లె వంటి మెట్ట ప్రాంతాల్లో కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
సవాళ్ల మధ్య రబీ సాగు
రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం రబీ సీజన్లో పంటల సాగు సవాళ్లు ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో కేసీఆర్ ఆధారంగా ఉద్యానవన పంటల్లో అరటి, బొప్పాయి, వేరుశనగ, మొక్కజొన్న, , మినుములు, నువ్వుల పంటలు సాగులో ఉన్నాయి.
ప్రస్తుత సీజన్లో కేసీ కెనాల్ (KC canal) ఆయకట్టులో సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడం ఓ సవాల్ గా మారింది. ప్రభుత్వం స్పందించి కేసీ కాలువకు నీరు విడుదల చేయడంతో పాటు, శ్రీశైలం డ్యాం వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయకుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం లేకపోలేదనేది రైతు సంఘాలు చెబుతున్నాయి.
కేసీ కెనాల్ ఆధారంగా 2,65628 స్థిరీకరించారు. ఇందులో కర్నూలు, నంద్యాల విభజిత జిల్లాల పరిధిలో నందికొట్కూరు పాణ్యం బనగాల వంటి ప్రాంతాల రైతాంగం 1.82 లక్షల ఎకరాలకు, కడప జిల్లాలోని మైదుకూరు ప్రొద్దుటూరు కాజీపేట చెన్నూరు వంటి ప్రాంతాలలో 83,000 ఎకరాలకు నేరు అందించాల్సిన పరిస్థితి ఉంది. నీటి లభ్యత ఆధారంగా ఆహార పంటల్లో వరి జొన్న సజ్జ వంటి పంటలను సాగు చేసే రైతాంగం కేసీ కెనాల్ నీటిని వాడుకుంటారు. వాణిజ్య పంటలైన పత్తి మిర్చి వంటి పంటలు కర్నూలు నంద్యాల జిల్లాలోను, కడప నంద్యాల జిల్లాల్లో వేరుసెనగ పొద్దుతెరుగుడు ఓ పాటు ఓ పప్పు ధాన్యాల్లో మినుము పెసర వంటి పంటలు కూడా ఆడుతడి పంటలుగా సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ సంవత్సరం జనవరి నాటికి కేసీ కాలువ కింద ప్రధానంగా వరి 80% మిగిలిన 20 శాతం లో మినుము వేరుశనగ మొక్కజొన్న నువ్వుల పంటలు సాగులో ఉన్నాయి. నందికొట్కూరు శ్రీశైలం నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల్లో రైతులు రవి పంటలు సాగు చేస్తున్నారు.
"రాయలసీమకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు కారణంగా నీటి నిలువ పరిమితి స్థాయిలోనే ఉంది. దీంతో 0-150 కిలోమీటర్ పరిధిలో రెండో పంటకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని తుంగభద్ర డ్యామ్ నీటిపారుదల శాఖ అధికారులు మొదట ప్రకటించారు. అప్పటికే పంటలు సాగులోకి తెచ్చిన రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పానుకూలంగా స్పందించి రెండు విడుదలగా 20 రోజుల వ్యవధిలో ఒకసారి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కర్నూలు జిల్లా మల్యాల వద్ద ఉన్న హంద్రీనీవా కాలువ ద్వారా కేసీ కాలువకు నీటిని పంపించేశారు. ఫిబ్రవరి నెల చివరిలో మల్యాల నుంచి 330 క్యూసెక్కులు, ముచ్చుమరి నుంచి 245 కేసులు అన్నిటిని విడుదల చేశారు.
"జూలై వరకు తాగిన నీటి అవసరాలు తీర్చడంతో పాటు వెన్ను దశలో ఉన్న రబీ పంటలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది"
శ్రీశైలం నీటిని సంరక్షించండి...
రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీశైలంలో నీటిని సంరక్షించాల్సిన అవసరాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దసరామిరెడ్డి గుర్తు చేశారు.
"శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కనీస నీటిమట్టం కంటే దిగువకు తెలంగాణ ప్రాంతానికి నీటిని విడుదల చేయకుండా నిలువరించడంతోపాటు విద్యుత్ ఉత్పత్తిని కూడా ఆపించండి" అని కోరుతూ సాగునీటి సమితి కార్యవర్గ సభ్యులతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ కి వినతి పత్రం సమర్పించారు.
కడప కర్నూలు కాలువ ఆయకట్టులో రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా సాగులోని పంటలను కాపాడడంతో పాటు వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు.
"కెసి కెనాల్ సంబంధించి అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలు, రాష్ట్ర విభజన చట్టం లోని అంశాలు పరిగణలకు తీసుకొని నీటి విడుదలపై తగా నిర్ణయం తీసుకోండి" అని రాయలసీమ సాగునీటి సమితి ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్ రెడ్డి కోరారు.
రాయలసీమ ప్రాంత రైతాంగ సమస్యలపై సమితి ప్రతినిధులు బొజ్జ దశరథ రామిరెడ్డి, శంకర్ రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు ఏమన్నారంటే..
"సాగునీటి సలహా మండే సమావేశానికి ముందుగానే రైతులు విస్తృతంగా రవి పంటలు సాగు చేశారు. బీసీ కెనాల్ ఆయకట్టుకు మచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడండి. కుందూ నది పరివాహక ప్రాంతంలో నంద్యాల వరకు తాగునీటి అవసరాల కోసం అలగనూరు కాలువ ద్వారా నీటిని సరఫ చేయండి" అని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు కోరారు.
ఈ సంవత్సరంలో శ్రీశైలం రిజర్వాయర్ కు సమృద్ధిగా నీటి ప్రవాహం వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు నిబంధనలను అమలు చేయాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల కనీసం నీటిమట్టాన్ని నిలువ ఉంచే విధంగా నిబంధనలను పాటించకుండా వర్షాభావ పరిస్థితుల వల్ల మరింత ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడే ప్రమాదం లేకపోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రాయలసీమలో సాగునీటి తో పాటు ప్రజలను తాగునీటికి కూడా ఇబ్బంది పడకుండా నీటి హక్కులను కాపాడాలని ఈ ప్రాంత ప్రజల కోరుతున్నారు. భవిష్యత్తులో నీటి సంక్షేమంతుల మెత్తకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటూ కార్యాచరణ ప్రకటించాలని కూడా రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు కోరారు.
Next Story

