కట్ట పుట్టాలమ్మ దగ్గర ఏ రైలైనా ఎందుకు ఆగుతుందీ? ఏమిటీ మహత్యం?

Update: 2024-11-02 11:19 GMT

అక్కడేమీ సిగ్నల్ ఉండదు. ఏ గ్యాంగ్ మెన్ ఎర్రజెండా పట్టుకుని నిదానంగా వెళ్లమని చెప్పడు. ట్రాక్ మరమ్మతులు జరిగే ఆనవాళ్లూ ఉండవు. అయినా సరే.. 100 కిలోమీటర్ల వేగంతో వచ్చే రైలయినా సరే అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా ఆగి సాగుతోంది. ఇదేదో ఒక్కరోజో రెండ్రోజులుగా సాగుతున్న తంతు కాదు. భారతీయ రైల్వే ట్రాక్ ఏర్పడినప్పటి నుంచి ఇదే సాగుతోంది. ఎందుకిలా? స్థల మహత్యామా? కట్టపుట్టాలమ్మా శాపమా! అందర్నీ అబ్బురపరిచే ఈ ప్రాంతం ఎక్కడుందంటే.

కట్ట పుట్టాలమ్మ దగ్గర ఏ రైలైనా ఎందుకు ఆగుతుందీ? ఏమిటీ మహత్యం? పూర్తి వీడియో 

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. అక్కడికి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పైన రైల్వే ట్రాక్. కింద గుడి. తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో మాత్రమే మీకు అలాంటి గుడి కనిపిస్తుంది. పేరు- కట్ట పుట్టాలమ్మ ఆలయం. పట్టాల  పైన రైలు కూత పెడుతుంటే, కింద ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటారు. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. చెరువు కట్టపై కొలువై ఉన్న ఈ అమ్మవారిని స్థానికులు ఇష్టదైవంగా కొలిచేవారట. బ్రిటీష్ వారి కాలంలో అమ్మవారి ఆలయం మీదుగా రైల్వే లైన్ వేయాలని నిర్ణయించారు. పనులు చేపట్టారు గాని ముందుకు సాగడం లేదు. తరచూ ఏదో ఒక అవాంతరం ఏర్పడేదట. ఇది అమ్మవారి మహిమేనని స్థానికులు చెప్పడంతో ఆలయాన్ని అలాగే ఉంచి పైనుంచి రైల్వే లైన్ వేశారు. అదే ఆ తర్వాత శ్రీ కట్టపుట్టాలమ్మ అమ్మవారి ఆలయంగా పేరుగాంచింది.ఈ ఆలయానికి ఏడు వందల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకులు మద్రాసు నగరానికి వెళ్లేందుకు అమ్మవారి ఆలయం పైనుంచి రైలు మార్గం వేశారు. అమ్మవారి శిరస్సు పై నుంచి రైళ్లు వెళుతుండడంతో ఒక్కసారిగా రైళ్లు ఆలయం దగ్గరకు చేరుకునే టైంకి రైళ్లు ఉన్న పళంగా ఆగిపోయేవట. ఇదేంటో రైల్వే అధికారులకు అర్థం కాలేదు. ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా రైళ్లు ఎందుకు ఆగిపోతున్నాయో తెలియక తికమకపడ్డారు. కొంత కాలానికి అక్కడ ఆలయం ఉన్నట్టు గమనించిన అధికారులు ఇదంతా అమ్మవారి మహిమ వల్లే అనుకుని రైల్వే సిబ్బంది తమ పై అధికారులకు తెలియజేశారట. దాంతో రైల్వే అధికారులు ఆలయ ధర్మకర్తలు, పూజారులతో‌ సంప్రదించారని, రైళ్లు ప్రతిసారీ అమ్మవారి శిరస్సు పైన నుంచి వెళుతండటంతో అమ్మవారికి తల నొప్పి వస్తోందని, అందుకే అమ్మవారు రైళ్ళను ఆపేశారని సమాధానం ఇచ్చారని స్థానికులు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. భక్తుల మనోభావాలను గమనించి ఆలయాన్ని కొంచెం వెనక్కి జరిపి నిర్మించారని, అప్పటి నుంచి రైళ్లు అక్కడికి వచ్చే సరికి స్పీడ్ తగ్గించి నెమ్మదిగా వెళుతుంటాయని చెబుతారు.

ప్రతి శుక్రవారం, ఆదివారం, మంగళవారం ఈ ప్రాంతం మహారద్దీగా ఉంటుంది. స్థానికులతో పాటు రైల్వేకోడూరు, రాజంపేట, పుత్తూరు నగరితో పాటు వివిధ రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడ అమ్మవారు సత్య ప్రమాణాలకు నిలయంగా కూడా ప్రసిద్ధి. ఊళ్లల్లో వచ్చే గొడవలకు ఇరుపక్షాల వారు వచ్చి ఇక్కడ ప్రమాణాలు చేస్తుంటారు. అమ్మవారిపై ప్రమాణం చేసి అబద్ధం చెబితే కీడు జరుగుతుందనే నమ్మకం ఉంది. దుర అలవాట్లను మాన్పించడానికి కూడా ఇక్కడ ప్రమాణాలు చేయిస్తుంటారు. దీనికి సంబంధించి కూడా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక్కరోజు కరకంబాడీలో మిరియాలు అమ్ముకుంటూ వ్యాపారులు వెళుతుండగా అక్కడే ఉన్న ఓ ముసలమ్మ 'నాయనా, తలనొప్పి గా ఉంది కాసిని మిరియాలు పెట్టండి' అని అడిగితే ఆ వ్యాపారులు 'ఇవి‌ మిరియాలు కాదు, జొన్నలు అని‌చెప్పి వెళ్లిపోయారు. కొద్ది దూరం వెళ్ళి మిరియాల మూట విప్పి చూడగా మూటలో అన్ని జొన్నలే ఉన్నాయి. వెంటనే ఆ పెద్దావిడను వెతుక్కుంటూ వెళ్లారు అమ్మ మీరు ఎవరు మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటూ వ్యాపారస్తులు మేము పొరపాటున జొన్నలు' అని చెప్పారని, తీరా ఊరెళ్లి చూసుకుంటే అవి నిజంగానే జొన్నలుగా మారాయనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ వ్యాపారులు తప్పు తెలుసుకుని క్షమించమ్మా అని వేడుకుంటే ఆ తల్లి వాటిని మిరియాలుగా మార్చిందని భక్తులు చెబుతుంటారు.

ప్రతి ఏటా కట్టపుట్టాలమ్మ జాతర జరపడం ఆనవాయితీ వస్తోంది. జాతరలో అమ్మవారికి జంతుబలి ఇస్తుంటారు. కొన్ని గ్రామాల వాళ్లు ఈ అమ్మవారి పేరిట దున్నపోతు వదలుతుంటారు. ఆలయం ముందు భాగంలో ఓ గోతిని తవ్వి జాతరలో బలిచ్చిన వాటి కళేబరాలను పాతిపెట్టి ఆ తర్వాత జరిగే జాతర సమయంలో ఆ గోయ్యిని తొవ్వి అమ్మవారి మహాత్యాన్ని పరీక్షిస్తుంటారు.భక్తుల విశ్వాసాలు ఎలా ఉన్నా రైళ్లు మాత్రం ఆ ప్రాంతానికి వచ్చే టైంకి ఆగడమూ, నిదానంగా వెళ్లడమో ఇప్పటికీ జరుగుతోంది. కొందరు సాంకేతిక నిపుణులు చెప్పేదాని ప్రకారం ఆ ప్రాంతంలో రైలు వంతెన ఉందని, దానికి ముందు రైల్వే స్టేషన్ కూడా ఉండడంతో రైళ్లను నిదానంగా పూనిస్తారని, అంతేతప్ప అమ్మవారి ఆలయానికి రైళ్లు నిదానంగా వెళ్లడానికి ఏమాత్రం సంబంధం లేదంటున్నారు.


Tags:    

Similar News