తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఓటెందుకు వేశారు?

తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే కూడా ఓటు వేశారు.

Update: 2024-10-20 14:38 GMT

తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద ఆదివారం వాతావరణం కోలాహలంగా మారింది. సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో వారం రోజుల ప్రచారం ముగిసింది. చివరి అంకంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి పోలింగ్ ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి ఎన్నిక జరుగుతుంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో 562 మంది సభ్యులు ఓటర్లుగా ఉన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం, విజయవాడ తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన నగరాల్లో తిరుపతి కూడా ప్రధానమైనది. మిగతా నగరాలతో పోలిస్తే తిరుపతిలో జర్నలిస్టు సంఘం ఎన్నికలు కాని, ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నిర్వహించేది ఎన్నికల ప్రక్రియ శైలి ఆదర్శవంతంగా ఉంటుంది. తిరుపతి ప్రెస్ క్లబ్ జనరల్ బాడీ తర్వాత ఎన్నికల నిర్వహించడానికి సీనియర్ సభ్యులు ఒకరైన బొమ్మల మురళికి రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తీసిపోని రీతిలో ఎన్నికల నిర్వహణ సాగింది. రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన బొమ్మల మురళి అవుట్ గో యింగ్ కార్యవర్గం నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవడంతోపాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా ప్రెస్ క్లబ్ ఆ పరిసర ప్రాంతాల్లోని 200 అడుగుల దూరంలో ప్రచారం నిర్వహించడం, ఇతరత్రా కార్యకలాపాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ఎన్నికల సంఘానికి సమాంతరంగా నిర్వహించడం కూడా ఆయన ప్రత్యేకత. దీనిపై తిరుపతి ప్రెస్ క్లబ్ రిటర్నింగ్ అధికారి బొమ్మల మురళి మాట్లాడుతూ," సమాజంలో కీలక పాత్ర పోషించే ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నిబంధనలు అమలు చేయడంలో రాజీ పడడం లేదు. సమాజంలో మనం ఆదర్శంగా ఉండాలి అనే సందేశాన్ని పంపించడమే ప్రధాన ఉద్దేశం" అని బొమ్మల మురళి వ్యాఖ్యానించారు. " ప్రెస్ క్లబ్ ఎన్నికలు అంటే అంతా మన జర్నలిస్టు మిత్రులే. రాబోయే తరం కూడా ఈ తరహా ఆదర్శంగా ఉండాలని పాఠం నేర్పించడానికి ఎన్నికల నిర్వహణలో నిబంధనలు కఠినంగానే అమలు చేశాం" అని మురళి స్పష్టం చేశారు.తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల ఫోటోలతో రహస్య బ్యాలెట్ విధానం అమలు చేశారు. అభ్యర్థుల పేర్లతో పాటు ఫోటో కూడా ముద్రించడం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహించాము" అని రిటర్నింగ్ అధికారి బొమ్మల మురళి స్పష్టం చేశారు. పోలింగ్ సందర్భంగా కూడా ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు, సెక్యూరిటీ చెక్ నిర్వహించి వినూత్న పద్ధతులకు ఈసారి ఎన్నికల్లో తెర తీశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నికల వ్యవహార సరళి కూడా పోలీసు వర్గాల మంచి కూడా అభినందనలు అందుకుంది. ఎన్నికల వ్యవహార సరళిని పరిశీలించిన సీనియర్ జర్నలిస్టులు కూడా అభినందించారు. వారం నుంచి తిరుపతి ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ఈ ఎన్నికలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసుకొని రీతిలో కటౌట్లు ఏర్పాటు చేయడం. ఓటింగ్ లు అమర్చడం. నగరంలో జర్నలిస్టు నివాసాలకు వెళ్లి ప్రచారం చేయడం. హామీలు ఇవ్వడం వంటి కార్యకలాపాలతో మూడు ప్యానల్స్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే,

ఓటు వేసిన ఎమ్మెల్యే

ఈసారి జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రత్యేక చమక్కు కూడా చోటుచేసుకుంది. ఓ టీవీ ఛానల్ రీజనల్ ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ మురళీమోహన్ 2024 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సభ్యుడైన డాక్టర్ మురళీమోహన్ జర్నలిస్టుగా కూడా ఆదివారం జరిగిన పోలింగ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Tags:    

Similar News