Tirumala || నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం.
కీలక అంశాలపై చర్చించనున్న పాలకమండలి.;
By : Dinesh Gunakala
Update: 2025-07-22 04:37 GMT
తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 45 కు పైగా అంశాలపై చర్చించి బోర్డు తీర్మానాలు చేయనుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణాల ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
వేదపారాయణదారులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేయాలని తీర్మానంతో పాటు, పలు కీలకాంశాలపై టీటీడీ బోర్డు చర్చలు జరుపనుంది. టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులరైజ్ చేసే అంశంపై చర్చించి.
తీర్మానం చేయనుంది. తిరుమలలోని పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్ క్రింద పునర్నిర్మించే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు ఒంటిమిట్ట రామాలయం లో నిత్య అన్నదానం ప్రారంభం కానున్నట్లు సమాచారం.