ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్..!
By : Dinesh Gunakala
Update: 2024-12-09 13:54 GMT
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. గుర్తుతెలియని ఆగంతకుడి నుంచి చంపేస్తామని హెచ్చరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపినట్లు సమాచారం. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఇప్పటికే పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం బెదిరింపు కాల్స్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు. గతంలో కూడా పవన్ కల్యాణ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా పవన్ కల్యాణే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు . తాజాగా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది.