తిరుపతి జిల్లా శ్రీహరికోట :-
PSLV-C59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం 05.12.2024 సాయంత్రం ఈ రాకెట్ నింగిలోకి వెళ్లింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను PSLV-C59 కక్ష్యలోకి తీసుకెళ్లింది. బుధవారం నాడు సాంకేతిక సమస్యతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని గురువారానికి వాయిదా వేశారు. సూర్య కిరణాలను ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. సూర్యుడి కరోనాపై పరిశోధనలు చేయనున్న ప్రోబా-3 శాటిలైట్లు.కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా-3 శాటిలైట్లను రూపొందించారు. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించి కరోనాను శోధించడం ప్రోబా-3 ప్రత్యేకత.