నాలుగు దశాబ్దాల చరిత్రను బ్రేక్‌ చేసిన జగన్, చంద్రబాబు

ఏలూరు ప్లామెంట్‌ అభ్యర్థుల ఖరారులో రికార్డును బ్దలు కొట్టిన జగన్, చంద్రబాబు

Update: 2024-04-24 12:17 GMT


ఏలూరు పార్లమెంట్‌ నియోజక వర్గానికి అభ్యర్థులను ఖరారు చేయడంలో అటు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేశారు. ఓసీలకు కాకుండా ఈ సీటును బీసీలకు కేటాయించడంతో చరిత్రకెక్కారు. యాదవ సామాజిక వర్గానికి కేటాయించి ఇద్దరూ రికార్టు సృష్టించారు.
బీసీల వైపు అడుగులు ఇలా
వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కోటగిరి శ్రీథర్‌ 2024 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంతో బీసీల వైపు సీఎం జగన్‌ అడుగులు వేశారు. బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గం వైపు సీఎం జగన్‌ మొగ్గు చూపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను రంగంలోకి దింపారు. ఈయన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు. ఆర్థికంగా బలమైన నేత కావడంతో సినీల్‌ను రంగంలోకి దింపారు.
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత సీఎం జగన్‌ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపి, టీడీపీ నుంచి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపాలనే తప్పని పరస్థితులు చంద్రబాబుకి కల్పించారు సీఎం జగన్‌. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతనే ఏలూరు ఎంపీగా బరిలో దింపాలని నిర్ణయించింది. చంద్రబాబుకు బీసీ నేతను ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా రంగంలోకి దింపాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అందుకు చారిత్రక కారాణాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించిన నాటి నుంచి గత ఎన్నికల వరకు అంటే సుమారు నాలుగు దశాబ్దాల పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థులుగా రంగంలోకి దింపుతూ వచ్చారు. గత ఎన్నికల్లో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మాగంటి బాబును టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు చంద్రబాబు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వెలమ సామాజిక వర్గానికి చెందిన కోటగిరి శ్రీథర్‌ చేతిలో ఓడి పోయారు. జగన్‌ యాదవ సామాజిక వర్గానికి ఈ స్థానం కేటాయించడంతో మాగంటి బాబు కాకుండా చింతలపూడి అసెంబ్లీ నియోజక వర్గం కామవరపుకోట మండలం కంఠమనేనివారి గూడెంకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గోరుముచ్చ గోపాల్‌ యాదవ్‌ను రంగంలోకి దింపాలని తొలుత చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. ఆ మేరకు గోరుముచ్చ గోపాల్‌కు ఆర్థిక వనరులు కూడా రెడీ చేసుకోవాలని కూడా టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది.
తెరపైకి యనమల అల్లుడు
అయితే ఈ లోగా టీడీపీ సీనియర్‌ నేత, చంద్రబాబు తర్వాత ఆ పార్టీలో అంతటి ప్రాధాన్యత కలిగిన యనమల రామకృష్ణుడు ఈ అంశంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎలాగూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతకే ఈ సీటు ఇస్తున్నారు కాబట్టి ఆ సీటును తన అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌కు కేటాయించాలనే ప్రతిపాదనను చంద్రబాబు ముందు ప్రవేశపెట్టారు. యనమల చెప్పిన తర్వాత ఇక చంద్రబాబు కాదనేది ఏముంటుంది. సరే అలాగే కానివ్వండి అన్నట్లు యనమలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే శారు చంద్రబాబు. అలా ఏలూరు పార్లమెంట్‌ టీడీపీ టీకెట్‌ను తన అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌కు ఇప్పించుకోవడంలో యనమల చక్రం తిప్పారు.
తొలుత బ్రేక్‌ చేసింది చిరంజీవి
ఒక సారి ఏలూరు పార్లమెంట్‌ స్థానం చరిత్ర చూస్తే అటు కాంగ్రెస్‌ కానీ ఇటు టీడీపీ కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపుతూ వచ్చాయి. 2014లో జగన్‌ దీనిని బ్రేక్‌ చేసి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను రంగంలోకి దింపారు. 2019లో వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలపారు. ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్‌ సీటును రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ బీసీల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపడం ఇదే మొదటి సారి. గత 40 ఏళ్లల్లో కమ్మ సామాజిక వర్గాన్ని దాటి వెళ్ల లేదు. ఈ రికార్డును తొలుత చిరంజీవి బద్దలు కొట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కొలుసు రెడ్డయ్య యాదవ్‌ను బరిలో దింపారు. ఈయన పెనమలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తండ్రి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా అటు చంద్రబాబు, ఇటు జగన్‌ కూడా పూర్తి స్థాయిలో ఈ రికార్డును బ్రేక్‌ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఎవరు గెలిచిన ఏలూరు నుంచి ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తొలి సారి పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి.
Tags:    

Similar News