కెనడాలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం: పుట్టినరోజునాడే దుర్ఘటన

నిన్న కొందరు మిత్రులతో కలిసి టొరంటోలో ఒక సరస్సుకు ఈతకొట్టి సరదాగా గడపటానికి వెళ్ళారు. పుట్టినరోజునాడే ప్రణీత్ చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Update: 2024-09-16 09:39 GMT

కెనడాలో ఎమ్ఎస్ చేయటానికి వెళ్ళిన ప్రణీత్ అనే యువకుడు నిన్న అక్కడ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. నిన్న పుట్టినరోజునాడే అతను చనిపోవటంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

హైదరాబాద్ నగరంలోని మీర్ పేటకు చెందిన రవి, సునీతలకు ప్రణీత్ రెండవ కుమారుడు. పెద్ద కుమారుడు కూడా ఉన్నత చదువుకోసం కెనడాలోనే ఉంటున్నాడు. నిన్న వీరిద్దరూ కొందరు మిత్రులతో కలిసి టొరంటోలో ఒక సరస్సుకు ఈతకొట్టి సరదాగా గడపటానికి వెళ్ళారు. తిరిగివచ్చిన తర్వాత చూసుకుంటే అన్నకు తమ్ముడు కనిపించలేదు. తర్వాత అందరూ కలిసి పోలీసులకు తెలిపి సరస్సువద్దకు వెళ్ళారు. అక్కడ గజఈతగాళ్ళు వెతకగా చివరికి భౌతికకాయం దొరికింది. కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని తండ్రి రవి వేడుకున్నారు.

Tags:    

Similar News