Tirumala || తిరుమల శ్రీవారికి భారీ విరాళం..!

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం;

Update: 2025-04-27 10:08 GMT

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు.స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని. కానుకలు, విరాళాలను అందిస్తుంటారు. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద ఇటీవల విరాళంగా అందించింది. ఈ  మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.

Tags:    

Similar News