అందరూ కోటీశ్వరులే అందులో ఆయనే టాప్‌

ప్రధాన పార్టీల నుంచి పోటీకి దిగుతున్న వారందరూ కోటీశ్వరులే. లగ్జరీ కార్లు, కిలోల కొద్ది బంగారం వారి సొంతం.

Update: 2024-04-23 12:06 GMT


ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులందరూ కోటీశ్వరులే. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ధనవంతులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశంతో పాటు వైఎస్‌ఆర్‌సీపీల్లోను ధనవంతులే రంగంలోకి దిగారు. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన వారందరూ కోటీశ్వరులే అయినా వారిలో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అపర కుభేరుడు. దేశ, విదేశాల్లో కూడా ఆయనకు భవంతులు, భూములు ఉన్నాయి.

వేల కోట్ల అధిపతి
గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆస్తులు రూ. 5,700 కోట్లు. ఆయన పేరు మీద ఉన్న చరాస్తులు రూ. 2,316 కోట్లు కాగా, ఆయన భార్య శ్రీరత్న పేరు మీద ఉన్న చరాస్తులు రూ. 2,280 కోట్లు ఉన్నాయి. ఇరువురి పేర్ల మీద రూ. 1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. వీటితో పాటు రూ. 6.11 కోట్ల విలువైన 4 కార్లు ఉన్నాయి. భార్యా భర్తల బ్యాంకు ఖాతాల్లో రూ. 5.9 కోట్లు చొప్పున నగదు ఉంది. బంగారం కూడా భారీగానే ఉంది. 6.86కిలోల బంగార ఆభరణాలు ఉన్నాయి. ఇవి కాకుండా గుంటూరు జిల్లాలో రూ. 2.67 కోట్ల విలువైన సాగు భూమి, హైదరాబాద్‌లో రూ. 28.1కోట్ల భూమి, రూ. 29.73 కోట్ల విలువైన కమర్షియల్‌ కాంప్లెక్స్, ఢిల్లీలో రూ. 72 కోట్ల విలువైన బిల్డింగ్‌తో పాటు అమెరికాలో రూ. 6.82 కోట్ల ఖరీదైన భూమి ఉంది. చంద్రశేఖర్‌ సతీమణి శ్రీరత్న పేరుతో కృష్ణా లల్లాలో రూ. 2.33 కోట్ల విలువ సాగు భూమి, ఢిల్లీలో రూ. 34.82 కోట్ల విలువ చేసే భవనం, అమెరికాలో రూ. 28.26 కోట్ల నివాస భవనాలు ఉన్నాయి. అప్పలు కూడా భారీగానే ఉన్నాయి. చంద్రశేఖర్‌ పేరు మీద రూ. 519 కోట్లు, ఆయన భార్య శ్రీరత్న పేరు మీద రూ. 519 కోట్లు అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు.
లోకం మాధవి కూడా ధనవంతురాలే
నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తులు రూ. 894.92 కోట్లు. విజయవాడ సెంట్రల్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెల్లంపల్లి ఆస్తులు 22.6 కోట్లు. ఆయన పేరుతో రూ. 1.55 కోట్ల విలువైన మెర్సిడిజ్‌ బెంజి కారు, రూ. 39.46లక్షల విలువైన కియా కార్నివాల్‌ కారు, రూ. 16.63లక్షల విలువైన స్కార్పియో కార్లు ఉన్నాయ. ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బూచేపల్లి శిపప్రసాద్‌రెడ్డి రూ. 39.71 కోట్లు ఆస్తులున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారహిల్స్, కొండాపూర్, చీమకుర్తి, దర్శి, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో నివాస భవనాలు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి వెల్లడించారు.రూ. 72 లక్షల విలువైన బిఎండబ్ల్యూ కారుతో పాటు ఇన్నోవా కార్లు ఉన్నాయి. ఆయన భార్య వద్ద రూ. 46లక్షల విలువైన మినీ కూపర్‌ కారు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బిజెపీ అభ్యర్థి సుజనా చౌదరి, తన సతీమణి పద్మజ పేరుతో రూ. 27.93 కోట్లు ఆస్తులు ఉండగా వీటిల్లో రూ. 15.27 కోట్లు చరాస్తులు, రూ. 12.66 కోట్లు స్థిరాస్తులు, రూ. 2.40లక్షల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్‌ర్‌సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రూ. 20.57 కోట్లు ఆస్తులు, అప్పులు రూ. 3.45 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. చిత్తూరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి భార్య పేరు మీద రూ. 37.04 కోట్ల చరాస్తులు, రూ. 18.89 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి.
ధనవంతుడైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
నెల్లూరు జిల్లా కావలి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దంపతులకు రూ. 236.98 కోట్ల స్థిర,చరాస్తులు, ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేరు మీద రూ. 2.63 కోట్ల విలువైన 8 కార్లు, అతని భార్య పేరు మీద రూ. 1.33 కోట్ల విలువైన మూడు కార్లు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బుట్టా రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరు మీద రూ. 161.21 కోట్లు ఉన్నాయి. 2014లో వీరి ఆస్తులు రూ. 242.69 కోట్లు ఉన్నట్లు నాడు ప్రకటించారు. ఆటోమొబైల్స్, హోటళ్లు, విద్యా సంస్థలు బుట్టా రేణుక నిర్వహిస్తున్నారు. హోండా, టాటా మోటార్స్‌ వాహనాల డీలర్‌షిప్‌ ఉంది. హైదరాబాద్‌లో మాదాపూర్, ఇజ్జత్‌నగర్‌లో ప్లాట్లు, భవనాలు ఉన్నాయి. రూ. 2.54 కోట్ల విలువైన 2,375 గ్రాముల బంగారం, వజ్రాల హారాలు ఉన్నాయి. రేణుక భర్త పేరుతో 435 గ్రాముల » ంగారు నగలున్నాయి. శ్రీశైలం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి రూ. 131.71 కోట్లు ఆస్తులు, రూ. 28.24 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులకు రూ. 715.62 కోట్లు ఉన్నాయి. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ. 76.35 కోట్లు, ప్రభాకర్‌రెడ్డి పేరుతో రూ. 639.26 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. రూ. 197.29 కోట్లు అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. వీరికి రూ. 6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయి. నగరి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆర్కే రోజాకు 2019లో రూ. 2.74 కోట్ల చరాస్తులు ఉండగా 2024లో రూ. 4.58 కోట్లు, 2019లో రూ. 4.64 కోట్ల స్థిరాస్తులు ఉండగా 2024లో రూ. 6.05 కోట్లు ఉన్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రూ. 44.28 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన పేరు మీద హైదరాబాద్‌ గడ్డియన్నారంలో నాలుగు ప్లాట్లు, కుత్బుల్లాపూర్‌లో భూములు, మలక్‌పేటలో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వాటా, గచ్చీబౌలిలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఉన్నాయి. బాపట్ల వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, ఆయన భార్య బేబిలతల ఉమ్మడి ఆస్తి రూ. 2.74 కోట్లు ఉంది. నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరుతో రూ. 5.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య పద్మావతి పేరుతో రూ. 10.84 కోట్లు ఉంది. అనంతపురం జిల్లా పెనుగొండ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఉష శ్రీచరణ్‌ పేరుతో రూ. 4.16 కోట్లు చరాస్తులు, రూ. 1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. రూ. 1.25 కోట్ల విలువైన 5.27కిలోల బంగారం, 78 కిలోల వెండి ఉంది. భర్త శ్రీచరణ్‌ పేరుతో రూ. 7.02 కోట్ల చరాస్తులు, రూ. 37.91 కోట్ల స్థిరాస్తులు, 1.607కిలోల బంగారం, 48కిలోల వెండి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ పేరుతో రూ. 4.41 కోట్ల చరాస్తులు, రూ. 5.50 కోట్ల స్థిరాస్తులు, రూ. 4,41 కోట్ల విలువైన 4.6కిలోల బంగారం, 7.9కిలోల వెండి ఉన్నాయి. హిందూపూరం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ స్థిర, చరాస్తులు కలిపి రూ. 184.83 కోట్లు. రూ. 1.52 కోట్ల విలువైన 3 కార్లు ఉన్నాయి.
కొప్పుల రాజు ఆస్తులు 5 కోట్లు
నెల్లూరు పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఐఏఎస్‌ అధికారి కొప్పుల రాజు పేరుతో రూ. 5.10 కోట్లు, ఆయన భార్య మాజీ ఐఏఎస్‌ దమయంతి పేరుతో రూ. 6.44 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు రూ. 153.27 కోట్ల ఆస్తులు ఉన్నాయి. విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా పేరుతో రూ. 30.53 కోట్ల స్థిర ఆస్తులు, రూ. 30.66 కోట్ల చరాస్తులు, ఆయన భార్య సుజాత పేరుతో రూ. 25.38 కోట్ల స్థిరాస్తులు, రూ. 6.48 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఉమాకు రూ. 1.19 కోట్ల విలువైన మెర్సిడిస్‌ బెంజి కారు, ఆయన భార్య పేరుతో రూ. 37.95 లక్షల విలువైన కారు ఉంది. కర్నూలు జిల్లా ఆదోని బిజెపీ అభ్యర్తి డాక్టర్‌ పార్థసారథికి రూ. 56.37 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట వైఎస్‌ఆర్‌సీపీ అభ్యిర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రూ. 46.27 కోట్ల ఆస్తులు, రూ. 1.14 కోట్ల విలువైన ఆభరణాలు, ఆయన భార్య పేరుతో రూ. 1.44 కోట్ల విలువైన నగలు ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తోపుతుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబ ఆస్తులు రూ. 57.13 కోట్లు. గుంటూరు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కిలారి రోశయ్య కుటుంబ ఆస్తులు రూ. 70.50 కోట్లు. పల్నాడు జిల్లా వినుకొండ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 219.05 కోట్లు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు రూ. 124.84 కోట్లు. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణమరాజు ఆస్తుల విలువ రూ. 219.4 కోట్లు. గోపాలపురం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తానేటి వనిత కుటుంబం చరాస్తులు రూ. 3.73 కోట్లు, స్థిరాస్తులు రూ. 37.09 కోట్లు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీ చరాస్తులు రూ. 1.10 కోట్లు, స్థిరాస్తులు రూ. 2.46 కోట్లు.
Tags:    

Similar News