ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం!

చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, ఆయన భార్య బ్రహ్మణి, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Update: 2024-10-13 09:06 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ్ముడి కుమారుడు, ప్రముఖ హీరో అయిన నారా రోహిత్ నిశ్చితార్థం ఇవాళ హైదరాబాద్‌లో నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, ఆయన భార్య బ్రహ్మణి, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నారా రోహిత్ తన గత సినిమా ప్రతినిధి 2లో హీరోయిన్‌గా చేసిన శిరీషనే ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నారు. ఆయన 2018 తర్వాత ఆరేళ్ళ విరామం తీసుకుని ఈ ఏడాది ప్రతినిధి 2 సినిమాలో నటించారు. ప్రస్తుతం సుందరకాండ అనే సినిమాలో, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌లతో కలిసి ఒక మల్టీ స్టారర్‌లో నటిస్తున్నారు.

Tags:    

Similar News